మసూద్ అజహర్ కుటుంబం ముక్కలైంది: ఒప్పుకున్న జైషే మహమ్మద్

by Phanindra |

మసూద్ అజహర్ కుటుంబం ముక్కలైందని జైషే మహమ్మద్ ఉగ్రసంస్థ ఒప్పుకుంది. ఆపరేషన్ సిందూర్ దాడిలోనే జరిగిందని ఆ సంస్థ కమాండర్ వెల్లడించాడు.

మసూద్ అజహర్ కుటుంబం ముక్కలైంది: ఒప్పుకున్న జైషే మహమ్మద్
X

దిశ, నేషనల్ బ్యూరో: ఆపరేషన్ సిందూర్‌లో జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజహర్ కుటుంబ సభ్యులు మరణించినట్లు ఆ ఉగ్రవాద సంస్థ ఒప్పుకుంది. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేసే జైషే మహమ్మద్ ప్రధాన కార్యాలయంపై భారత దళాలు దాడి చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ దాడి గురించి జైషే కమాండర్ మసూది ఇల్యాస్ కశ్మీరీ మాట్లాడిన వీడియో వైరల్ అవుతోంది. మే 7న జరిగిన బహవల్పూర్‌లోని జైష్ హెడ్‌క్వార్టర్స్ జామియా మసీద్‌పై జరిగిన దాడుల్లో మసూద్ అజహర్ కుటుంబం ముక్కలైందని కశ్మీరీ వెల్లడించారు.

మసూద్ అజహర్‌ను ప్రపంచంలో తిరుగుబాటుకు నిదర్శనంగా అభివర్ణించిన కశ్మీరీ.. వాషింగ్టన్ నుంచి మాస్కో వరకూ అందరూ ఆయన గురించి మాట్లాడుకుంటారని చెప్పారు. ‘ఉగ్రవాదాన్ని అందిపుచ్చుకొని, పాకిస్తాన్ కోసం మేం ఢిల్లీ, కాబూల్, కాందహార్‌తో పోరాడాం. ఇన్ని త్యాగాలు చేసిన తర్వాత.. మే 7న బహవల్పూర్‌లో మౌలానా మసూద్ అజహర్ కుటుంబాన్ని భారత దళాలు ముక్కలు చేశాయి’ అని కశ్మీరీ పేర్కొన్నారు.

Next Story