డొనాల్డ్ భాయ్‌ వ్యాఖ్యలపై మోడీ మౌనం.. ప్రధానిపై జైరాంరమేశ్ చురకలు

by Phanindra |

డొనాల్డ్ భాయ్‌ వ్యాఖ్యలపై మోడీ మౌనం వీడరా? ఆయన మాటల్లో సగమైనా నిజముందా? ప్రధాని స్పందించాలన్న జైరాంరమేశ్.

డొనాల్డ్ భాయ్‌ వ్యాఖ్యలపై మోడీ మౌనం.. ప్రధానిపై జైరాంరమేశ్ చురకలు
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత్, పాక్ ఉద్రిక్తతలను తానే ఆపినట్లు యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి చెప్పడంపై ప్రధాని మోడీని కాంగ్రెస్ టార్గెట్ చేసింది. కాంగ్రెస్ కీలక నేత జైరాం రమేశ్ ఈ విషయంలో మోడీ మౌనం వీడాలని డిమాండ్ చేశారు. ‘గత 20 రోజుల్లో డొనాల్డ్ భాయ్ మూడు దేశాల్లోని మూడు నగరాల్లో పర్యటించారు. ఈ సమయంలో 9 సార్లు భారత్, పాక్ యుద్ధాన్ని ఆపింది తానే అని చెప్పుకున్నారు. వాణిజ్యాన్ని ఉపయోగించి యుద్ధం ఆపానని అన్నారు. చివరకు ఇంటర్నేషనల్ ట్రేడ్ కోర్టులో కూడా ఇదే చెప్పారు. దీనిపై ఆయన ఫ్రెండ్ నరేంద్ర మోడీ మాత్రం మౌనంగా ఎందుకుంటున్నారు? మోడీలాగే ట్రంప్ కూడా అబద్ధాలు ఆడుతున్నారా? లేదంటే ఆయన మాటల్లో కనీసం సగమైనా నిజం ఉందా?’ అని జైరాం రమేశ్ నిలదీశారు.


అయితే ట్రంప్ ఎన్నిసార్లు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం మాత్రం భారత్, పాకిస్తాన్ డీజీఎంవోల మధ్య చర్యల తర్వాతే కాల్పుల విమరణ జరిగిందని, ఈ విషయంలో మరోదేశం పాత్ర ఏమాత్రం లేదని చెప్తూ వస్తున్న సంగతి తెలిసిందే.

Next Story