పదే పదే ట్రంప్ నోట అదే మాట.. మోదీ స్పందనేదీ?: జైరాం రమేశ్‌

by Naga Rani Yarlagadda |

పహల్గామ్ ఉగ్రదాడి (Pahalgam Terror Attack), ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) తర్వాత భారత్ - పాక్ ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే.

పదే పదే ట్రంప్ నోట అదే మాట.. మోదీ స్పందనేదీ?: జైరాం రమేశ్‌
X

దిశ, వెబ్‌డెస్క్: పహల్గామ్ ఉగ్రదాడి (Pahalgam Terror Attack), ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) తర్వాత భారత్ - పాక్ ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఇరుదేశాల మధ్య యుద్ధం తీవ్రస్థాయిలో జరుగుతుందనుకున్న క్రమంలో అమెరికా దౌత్యంతో కాల్పుల విరమణ జరిగింది. ఈ విషయాన్ని ట్రంప్ పదే పదే ప్రస్తావిస్తుండటంపై కాంగ్రెస్ కమ్యూనికేషన్ ఇన్ఛార్జ్ జైరాం రమేష్ (Jairam Ramesh) విమర్శలు చేశారు. భారత్ - పాకిస్తాన్ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తానే తగ్గించానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వ్యాఖ్యలు చేయడంపై అసహనం వ్యక్తం చేశారు.

ద్వైపాక్షిక ఒప్పందం ద్వారా మాత్రమే కాల్పుల విరమణ జరిగిందని ప్రధాని ఎందుకు చెప్పట్లేదని ప్రశ్నించారు. ఈ విషయాన్ని ట్రంప్ పదే పదే ప్రస్తావిస్తున్నా.. మోదీ ఎందుకు స్పందించడం లేదని ఎక్స్ వేదికగా జైరాం రమేశ్ ఒక పోస్ట్ పెట్టారు. 21 రోజుల్లో 11 సార్లు ట్రంప్‌ నోట అదే మాట వచ్చిందని, ఇప్పటికీ మోదీ దీనిపై స్పందించకపోవడం ఏంటని అసహనం వ్యక్తం చేశారు.

Next Story