- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
jaipur jail scandal: ఆసుపత్రికని చెప్పి భార్యలు, గర్ల్ ఫ్రెండ్స్ తో ఖైదీల జల్సాలు.. జైపూర్ లో పోలీసుల నిర్వాకం
లంచాలకు ఆశపడిన పోలీసులు ఆసుపత్రికని చెప్పి బయటకు వచ్చిన ఖైదీలను వదిలేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ఆసుపత్రి పేరుతో జైలు నుంచి బయటకు వచ్చిన ఖైదీలు ఆసుపత్రికి వెళ్లకుండా తమ భార్యలు, గర్ల్ ఫ్రెండ్స్ తో జల్సాలు చేసిన ఘటన రాజస్థాన్ రాజధాని జైపూర్ జైల్లో (Jaipur jail scandal) కలకలం రేపింది. అలా బయటకు వెళ్లిన ఖైదీలు సాయంత్రమైనా తిరిగి రాకపోవడంతో జైలు అధికారులకు అనుమానం వచ్చి విచారణ చేపట్టగా సంచలన విషయాలు వెలుగు చూశాయి. జైపూర్ సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు రఫిక్ బక్రి, భన్వర్ లాల్, అంకిత్ బన్సాల్, కరణ్ గుప్తా లు ఎస్ఎంఎస్ ఆసుపత్రిలో వైద్య పరీక్షల కోసం అనుమతి పొందారు. దీంతో వీరిని నలుగురు కానిస్టేబుళ్లు శనివారం జైలు నుంచి బయటకు తీసుకువచ్చారు. ఆయితే వీరు తమ అపాయింట్మెంట్ ప్రకారం ఆసుపత్రికి వెళ్లకుండా నగరంలో తన భార్యలు, గర్ల్ ఫ్రెండ్స్ తో జల్సాగా (prisoners Jalsa) గడిపేందుకు ఎస్కార్ట్ పోలీసులకు లంచం ఇచ్చారు. ఒక్కో కానిస్టేబుల్ కు రూ. 5000 చొప్పున లంచం ఇచ్చేలా డీల్ కుదుర్చుకున్నారు. శనివారం ఆసుపత్రికి తరలించే నెపంతో జైలునుంచి బయటకు తీసుకువచ్చిన పోలీసులు వారి వద్ద లంచాలకు ఆశపడి వారిని వదిలేశారు. దీంతో రఫీక్ తన భార్యతో భన్వర్ తన మాజీ ప్రియురాలిని జలుపురా హోటల్ లో ఎంజాయ్ చేయగా అంకిత్, కరణ్ విమానాశ్రయానికి సమీపంలోని ఓ హోటల్ కు వెళ్లాడు. అయితే ఈ జల్సాలకు స్కెచ్ అంతా జైలు లోపలి నుంచే వ్యూహరచన జరిగినట్లు జైలు వర్గాలు తెలిపారు. ఈ ఘటనపై సవాయి మాన్ సింగ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. మొత్తం 13 మందిని అరెస్టు చేసి జైపూర్ సెంట్రల్ జైలులో దర్యాప్తు సోదాలు ప్రారంభించినట్లు సోమవారం పోలీసులు తెలిపారు.






