‘గాంధీ’ల కోసం జైళ్లు ఎదురుచూస్తున్నాయి.. సీఎం హిమంత సంచలన వ్యాఖ్యలు

by Kema Shiva Kumar |   (  Updated:2025-07-18 03:03:16  IST  )

లోక్‌సభా పక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) కోసం జైళ్లు ఎదురుచూస్తున్నాయని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ (CM Himanta Biswa Sarma) సంచలన వ్యాఖ్యలు చేశారు.

‘గాంధీ’ల కోసం జైళ్లు ఎదురుచూస్తున్నాయి.. సీఎం హిమంత సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: లోక్‌సభా పక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) కోసం జైళ్లు ఎదురుచూస్తున్నాయని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ (CM Himanta Biswa Sarma) సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం రాత్రి ఆయన గౌహతి (Guwahati)లో మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ అస్సాంలోని గోల్పారా (Goalpara)లో హింసను ప్రోత్సహించారని ఆరోపించారు. అటవీ భూములపై అతిక్రమణలను తొలగించే ప్రక్రియలో హింస చెలరేగడానికి కారణమైన ఉద్వేగభరిత వ్యాఖ్యలు చేశారని ఫైర్ అయ్యారు. ఈ ఘటనలో 21 మంది పోలీసులు గాయపడ్డారని, ఒక వ్యక్తి మరణించాడని ధ్వజమెత్తారు.

రాహుల్ గాంధీ, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) విదేశీ ఏజెంట్లుగా పనిచేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ వ్యవహారం మతతత్వ శక్తులను రక్షించేలా ఉందని అన్నారు. ఈద్ సందర్భంగా అస్సాంలో పశువులను చట్టవిరుద్ధంగా వధించి, మాంసం భాగాలను ఆలయ ప్రాంగణాల్లో విసిరిన వారికి రాహుల్ గాంధీ మద్దతును ఇవ్వడం సిగ్గుచేటని విమర్శించారు. అక్రమాస్తుల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రాబర్ట్ వాద్రా (Robert Vadra) ఆస్తులను స్వాధీనం చేసుకుందని అన్నారు. ఇక ‘గాంధీ’ల కోసం జైళ్లు కూడా ఎదురుచూస్తున్నాయని సీఎం హిమంత బిశ్వ శర్మ కామెంట్ చేశారు.

Next Story