Jailbird Sukesh : ఎలన్ మస్క్ కు జైలుపక్షి సుఖేష్ ఆఫర్ !

by Y. Venkata Narasimha Reddy |   (  Updated:2025-02-26 06:31:50  IST  )

ఆర్థిక నేరాలకు పాల్పడి జైలు(Jail)శిక్ష అనుభవిస్తున్న సుఖేష్ చంద్ర శేఖర్(Sukesh Chandra Shekhar)ఏకంగా ఎక్స్ ఓనర్ ఎలన్ మస్క్ కంపనీ(Elon Musk Company)లోనే పెట్టుబడులు పెడుతానంటూ ఆఫర్(Investments Offer)చేస్తూ జైలు నుంచి లేఖ(Letter) రాసి మరోసారి వార్తల్లో నిలిచాడు.

Jailbird Sukesh : ఎలన్ మస్క్ కు జైలుపక్షి సుఖేష్ ఆఫర్ !
X

దిశ, వెబ్ డెస్క్ : ఆర్థిక నేరాలకు పాల్పడి జైలు(Jail)శిక్ష అనుభవిస్తున్న సుఖేష్ చంద్ర శేఖర్(Sukesh Chandra Shekhar)ఏకంగా ఎక్స్ ఓనర్ ఎలన్ మస్క్ కంపనీ(Elon Musk Company)లోనే పెట్టుబడులు పెడుతానంటూ ఆఫర్(Investments Offer)చేస్తూ జైలు నుంచి లేఖ(Letter) రాసి మరోసారి వార్తల్లో నిలిచాడు. ఎక్స్ కంపెనీలో 2 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెడతానని మస్క్ కు ఆఫర్ ఇచ్చాడు. గతంలో ఎల్ఎస్ హోల్డింగ్స్ టెస్లా స్టాక్స్‌లో పెట్టుబడి పెడితే లాభాలు వచ్చాయని గుర్తు చేశాడు. ఎక్స్ నాకు ఇష్టమైన సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాం అని సుఖేష్ చెప్పుకొచ్చాడు. తన ఆఫర్‌ను అంగీకరించాలని లేఖలో కోరాడు.

సుఖేష్ రాసిన లేఖలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఎలన్ మస్క్‌ లపై అతడు ప్రసంశల వర్షం కురిపించాడు. ఎలన్ మస్క్ నా మనిషి అని పేర్కొన్నాడు. అమెరికా ప్రభుత్వం కొత్తగా సృష్టించిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ (DOGE)కి నాయకత్వం వహించినందుకు మస్క్ ను తన లేఖలో అభినందించాడు. అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ను పెద్దన్నయ్య అని లేఖలో సుఖేష్ పేర్కొన్నాడు.

ఆర్థిక నేరాలకు పాల్పడి జైలు శిక్ష అనుభవిస్తున్న సుఖేష్ చంద్ర శేఖర్ జైలు నుంచి తరుచు బహిరంగ లేఖలతో సంచలన అంశాలను ప్రస్తావిస్తూ వార్తల్లో నిలుస్తున్నాడు. ఆర్థిక నేరాలు, మోసాలతో కోట్ల రూపాయలు కొల్లగొట్టిన కేసులో ప్రస్తుతం సుఖేష్ ఢిల్లీలోని మండోలి జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ఇటీవల అతని ప్రియురాలు జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పుట్టిన రోజుకూడా సుఖేశ్ జైలు నుంచి లవ్ లెటర్ రాశాడు.

ఢిల్లీ లిక్కర్ కేసు మనీలాండరింగ్ కేసులో కవిత ప్రమేయంపై కూడా పలు ఆరోపణలతో లేఖలు రాశాడు. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులకు కూడా జైలు నుంచి లేఖలు రాసి చర్చనీయాంశంగా మారాడు.


Next Story