West Bengal: మమతా బెనర్జీ ఇంటి ముందు జై శ్రీరామ్ నినాదాలు..

by Ramesh Naini |

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ అత్యంత ఉత్కంఠభరితంగా సాగుతున్న వేళ రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

West Bengal: మమతా బెనర్జీ ఇంటి ముందు జై శ్రీరామ్ నినాదాలు..
X

దిశ, డైనమిక్ బ్యూరో: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ అత్యంత ఉత్కంఠభరితంగా సాగుతున్న వేళ రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఫలితాల్లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతుండటంతో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నివాసం వద్ద ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. తాజా ట్రెండ్స్ నేపథ్యంలో ఉత్సాహంతో ఉన్న బీజేపీ కార్యకర్తలు భారీగా సీఎం మమతా బెనర్జీ ఇంటి పరిసరాల్లోకి చేరుకున్నారు. అక్కడ ‘జై శ్రీరామ్’ అంటూ బిగ్గరగా నినాదాలు చేశారు. దీంతో ముఖ్యమంత్రి నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు, పోలీసులు.. బీజేపీ కార్యకర్తలను అక్కడి నుంచి పంపించి వేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

టీఎంసీ పార్టీ కార్యాలయానికి నిప్పు

మరోవైపు, రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉద్రిక్త ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. అసన్‌సోల్ పరిధిలోని జమురియాలో ఉన్న అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీ కార్యాలయానికి కొందరు దుండగులు నిప్పు పెట్టడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఉత్కంఠ రేపుతున్న ఈ కౌంటింగ్ ప్రక్రియలో ఏకంగా టీఎంసీ కంచుకోటను బీజేపీ బద్దలు కొట్టడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. గత 15 ఏళ్లుగా పశ్చిమ బెంగాల్‌లో ఎవరికీ అందనంత ఎత్తులో, ఎదురులేకుండా పాలిస్తున్న మమతా బెనర్జీకి ఈ అసెంబ్లీ ఎన్నికల సరళి గట్టి షాక్ ఇచ్చినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

Next Story