- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Jai shanker: ఆ దేశం ఉగ్రవాదానికి ప్రధాన కేంద్రం.. విదేశాంగ మంత్రి జైశంకర్
భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పాకిస్థాన్‌పై పరోక్షంగా తీవ్ర విమర్శలు గుప్పించారు.

దిశ, నేషనల్ బ్యూరో: భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పాకిస్థాన్‌పై పరోక్షంగా తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రపంచ ఉగ్రవాదానికి భారత పొరుగు దేశం ప్రధాన కేంద్రమని అభివర్ణించారు. ఒక దేశం ఉగ్రవాదాన్ని బహిరంగంగా రాష్ట్ర విధానంగా ప్రకటిస్తుందన్నారు. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో జైశంకర్ శనివారం ప్రసంగించారు. ‘స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి భారత్ ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటున్నది. ఎందుకంటే ప్రపంచ ఉగ్రవాదానికి కేంద్రంగా ఉన్న పొరుగు దేశం ఉంది. ప్రపంచంలో జరిగిన ప్రధాన ఉగ్రవాద దాడులు ఆ ఒక్క దేశంతోనే ముడిపడి ఉన్నాయి. ఐక్యరాజ్యసమితి వెల్లడించిన ఉగ్రవాదుల జాబితాలు సైతం ఆదేశ పౌరులతో నిండి ఉన్నాయి’ అని వ్యాఖ్యానించారు. ఉగ్రవాదం నుంచి తన ప్రజలను రక్షించుకునే హక్కును భారతదేశం ఉపయోగించుకుంటుందని నొక్కి చెప్పారు. ఒక దేశం ఉగ్రవాదాన్ని తన విధానంగా ప్రకటించినప్పుడు, ఉగ్రవాదులను బహిరంగంగా కీర్తించినప్పుడు, అటువంటి దాడులను బేషరతుగా ఖండించాలని సూచించారు.
మన హక్కులను నొక్కి చెబుతూనే, ముప్పులను కూడా దృఢంగా ఎదుర్కోవాలన్నారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం ఒక ప్రత్యేక ప్రాధాన్యత అని, ఎందుకంటే అది మతతత్వం, హింస, అసహనం, భయాన్ని రేకేత్తిస్తుందని చెప్పారు. ఉగ్రవాద స్థావరాలు పెద్ద ఎత్తున పనిచేస్తున్నాయని, వారికి అందే నిధులను ఆపాలన్నారు. ఉగ్రవాదం ఒక సాధారణ ముప్పు అని, దీని నియంత్రణకు అంతర్జాతీయ సహకారం ఎంతో అవసరమని నొక్కి చెప్పారు.






