కంగన గురించి నాకు తెలియదు.. బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు

by Ajay Maddhiboyina |

బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ పై సొంత పార్టీ నేత, మాజీ సీఎం జై రాం ఠాకూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ భారీ వర్షాలతో అతలాకుతలం అవుతున్న సంగతి తెలిసిందే.

కంగన గురించి నాకు తెలియదు.. బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ పై సొంత పార్టీ నేత, మాజీ సీఎం జై రాం ఠాకూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ భారీ వర్షాలతో అతలాకుతలం అవుతున్న సంగతి తెలిసిందే. అయితే కంగనా ఎంపీగా ఉన్న మండి నియోజకవర్గ ప్రజలు ఈ వరదలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో ఓ రిపోర్టర్ మోడీ ఘనా పర్యటనపై పోస్టు పెట్టిన కంగనా నియోజకవర్గం అతలాకుతలం అవుతున్నా ఎందుకు స్పందించలేదని అడిగారు. దాని జై రాం ఠాకూర్ సమాధానం ఇస్తూ అసహనం వ్యక్తం చేశారు.

కంగనా గురించి తనకు తెలియదని అన్నారు. పట్టించుకోని వాళ్ల గురించి తాను మాట్లాడాలని అనుకోవడం లేదని సమాధానం ఇచ్చాడు. పట్టించునే వాళ్ల గురించి ఏమైనా చేసేందుకు ఇక్కడ ఉన్నామని కానీ పట్టించుకోని వాళ్ల గురించి మాట్లాడాలనుకోవటంలేదన్నారు. మరోవైపు కాంగ్రెస్ కూడా కంగనా తీరుపై భగ్గుమంటోంది. కంగనా నియోజకవర్గం గురించి పట్టించుకోరు..ఇది మేం చెబుతోందని కాదు బీజేపీ నేతనే చెప్పారంటూ సోషల్ మీడియాలో ఆయన వీడియోను షేర్ చేస్తోంది. దీంతో నెటిజన్లు సైతం కంగనపై మండిపడుతున్నారు. ఆమె సినిమాలకు సోషల్ మీడియా పోస్టులకు తప్ప పరిపాలనకు సెట్ కారని విమర్శిస్తున్నారు.

Next Story