- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ధీటుగా సమాధానం చెప్పే సత్తా ఉంది: బంగ్లాదేశ్‌లో హత్యలపై స్పందించిన ప్రముఖ స్వామిజీ
బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న హత్యలు, దాడుల ఘటనలపై ప్రముఖ ఆధ్యాత్మిక గురువు జగద్గురు స్వామి రాంభద్రాచార్య తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న హత్యలు, దాడుల ఘటనలపై ప్రముఖ ఆధ్యాత్మిక గురువు జగద్గురు స్వామి రాంభద్రాచార్య తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనలు అత్యంత దురదృష్టకరమని, మైనారిటీలపై జరుగుతున్న అకృత్యాలు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. ఆదివారం రాజస్థాన్, జైపూర్‌లో మీడియాతో మాట్లాడిన స్వామి రాంభద్రాచార్య, అక్కడ ప్రస్తుతం ఉన్న తాత్కాలిక ప్రభుత్వం ఎక్కువ కాలం కొనసాగబోదని ఆయన జోస్యం చెప్పారు. అక్కడ ఎవరూ తమ ప్రతాపాన్ని (దాదాగిరి) చూపించలేరని, ఎవరి 'దాదాగిరి' కైనా దీటుగా సమాధానం చెప్పే సత్తా భారతదేశానికి ఉందని స్వామి రాంభద్రాచార్య తేల్చి చెప్పారు.
ఇదిలా ఉండగా.. బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయని ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. తాజాగా సునామ్‌గంజ్ జిల్లాలో జై మహాపాత్రో అనే యువకుడిపై దుండగులు దాడి చేయగా, తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. సునామ్‌గంజ్ జిల్లాలోని భంగడోహర్ గ్రామానికి చెందిన జై మహాపాత్రను గురువారం ఓ స్థానిక షాపునకు పిలిపించి దాడి చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన అతడిని సిల్హెట్ ఎంఏజీ ఉస్మానీ మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ దాడి పథకం ప్రకారం జరిగిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.






