- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ ఆర్టికల్స్ రద్దు చేయాల్సిన సమయం వచ్చింది.. మరోసారి బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
ఇటీవలే న్యాయ వ్యవస్థపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచిన బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే (BJP MP Nishikanth Dube) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్ డెస్క్: ఇటీవలే న్యాయ వ్యవస్థపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచిన బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే (BJP MP Nishikanth Dube) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. జమ్మూ కాశ్మీర్ (Jammu Kashmir)లో జరిగిన ఉగ్రదాడి (Terrorist Attack)పై సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. ఓటు బ్యాంకు రాజకీయాల వల్లే హిందువులకు ఈ గతి పట్టిందని అన్నారు. మతం ప్రాతిపదికన హత్యకాండ జరిగిందో లేదో లౌకికవాదులు చెప్పాలని డిమాండ్ చేశారు. అంతేగాక రాజ్యాంగంలోని ఆర్టికల్ 26 నుంచి 29 వరకు రద్దు చేయాల్సిన సమయం ఆసన్నమైందని హాట్ కామెంట్స్ చేశారు.
ఈ సందర్భంగా నిశికాంత్ దూబే ట్విట్టర్ లో.. హిందువులు, ముస్లింల పేరుతో దేశాన్ని విడదీసిన సమయంలో ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మైనారిటీల పేరుతో ముస్లింలకు ఎక్కువ హక్కులు కల్పించడంతో హిందువులు రెండవ తరగతి పౌరులుగా మార్చబడ్డారని వ్యాఖ్యానించారు. అలాగే సెక్యూలర్ నాయకులు అని పిలవడబేవారు ఉగ్రదాడిపై సిగ్గు పడాలి అంటూ.. పహల్గామ్ లో జరిగిన హత్యకాండ మత ప్రతిపదికగా జరిగిందా లేదా? చెప్పాలని డిమాండ్ చేశారు. అంతేగాక ఇది మోడీ ప్రభుత్వం (Modi Government).. హోంమంత్రిగా అమిత్ షా (Union Home Minister Amit Shah) ఉన్నారు.. పాక్ ఆక్రమిత కాశ్మీర్ (Pak Occupied Kashmir) మనదే అవుతుంది కాస్త ఓపిక పట్టండి అని అన్నారు. ఇక రాజ్యాంగంలోని ఆర్టికల్ 26 నుంచి 29 వరకు రద్దు చేయాల్సిన సమయం ఆసన్నమైనదని బీజేపీ ఎంపీ రాసుకొచ్చారు.






