'మీమ్స్' చేయడం వస్తే చాలు.. నెలకు రూ.1 లక్ష జీతం.. ఎక్కడో తెలుసా!

by Disha Web Desk 1 |
మీమ్స్ చేయడం వస్తే చాలు.. నెలకు రూ.1 లక్ష జీతం.. ఎక్కడో తెలుసా!
X

దిశ, వెబ్ డెస్క్: సోషల్ మీడియాలో చూస్తో ఎన్నో మీమ్స్ కనిపిస్తాయి. చాలా మంది మీమ్స్ చేసే వారిని చిన్న చూపు చూస్తారు. ఇలా సోషల్ మీడియాలో సమయం వృథా చేసుకుంటున్నారని భావిస్తారు. అయితే, ఇప్పుడు వారికి సైతం మార్కెట్లో డిమాండ్ పెరుగుతోంది. మీమ్స్ చేసే ఉద్యోగాలు సైతం వస్తున్నాయి. మీమ్స్ చేసే నైపుణ్యంతో పాటు ఆర్థిక వ్యవహారాలు, స్టాక్ మార్కెట్, వర్దమాన అంశాలపై మంచి అవగాహన ఉంటే మంచి జీతంతో ఉద్యోగాలు సాధించొచ్చు. బెంగళూరుకు చెందిన ఓ స్టార్టప్ కంపెనీ ఏకంగా నెలకి రూ.1లక్ష జీతం ఆఫర్ చేస్తోంది. మీమ్స్ చేయడంలో నైపుణ్యం కలిగి ఉంటే చాలంటోంది.

బెంగళూరుకు చెందిన స్టాక్ స్టిమ్యులేషన్ యాప్ అయిన స్టాక్ గ్రో అనే అంకుర సంస్థ మీమ్స్ తయారీకి సంబంధించిన జాబ్ ఆఫర్‌ను లింక్డ్‌ ఇన్‌లో పోస్ట్ చేసింది. చీఫ్ మీమ్ ఆఫీసర్ పోస్ట్‌ కోసం నెలకి రూ.1 లక్ష వరకు జీతం ఆఫర్ చేస్తున్నట్లు తెలిపింది. లింక్డ్‌ఇన్‌లో స్టాక్ గ్రో అనే స్టార్టప్ కంపెనీ ఈ పోస్ట్ చేసిన తర్వాత సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. వందల మందిని ఈ పోస్ట్ ఆకర్షిస్తోంది. 'చీఫ్ మీమ్ ఆఫీసర్ కోసం స్టాక్ గ్రో చూస్తోంది. వారు ఫైనాన్స్, స్టాక్ మార్కెట్ అంశాలను నవ్వించేలా మీమ్స్ తయారు చేయాలి. నిజానికి ఇది జనరేషన్ జెడ్ కొత్త విషయాలను ఏ విధంగా నేర్చుకుంటునేదనేదానిపై ఆధారపడి ఉంది. మనీ, స్టాక్స్ వంటి ఇతర అంశాలపై వేగంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేయగలే నేర్పరితనం మీకు ఉంటే ఈ ఆఫర్ మీకోసమే.' అని పేర్కొంది.

Next Story