- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సింధూ నదిలో పడిన ఐటీబీపీ బస్సు.. ప్రయాణికులు గల్లంతు
జమ్మూ కశ్మీర్‌లోని గందర్‌బల్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.

X
దిశ, వెబ్ డెస్క్: జమ్మూ కశ్మీర్‌లోని గందర్‌బల్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం ఉదయం (జులై 30) ఇండో-టిబెటన్ బార్డర్ పోలీస్ (ITBP) సిబ్బందిని తీసుకెళ్తున్న బస్సు సింధూ నదిలో పడిపోయింది. ఈ ఘటన కులన్ అనే ప్రదేశంలో జరిగింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న వారంతా నదిలో గల్లంతయ్యారు. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసు, ఎస్‌డిఆర్‌ఎఫ్, ఆర్మీ, ఇతర రెస్క్యూ బృందాలు ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించాయి. భారీ వర్షాల వాహనం అదుపుతప్పి నదిలో పడిపోయినట్లు తెలుస్తోంది. అయితే, భారీ వర్షం, ప్రవాహం కారణంగా గాలింపు చర్యలకు అంతరాయం ఏర్పడుతోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






