వామపక్షాలు మళ్లీ పుంజుకోవడం కష్టమే.. CPI చీఫ్ సెక్రటరీ డి.రాజా కీలక వ్యాఖ్యలు

by Kema Shiva Kumar |   (  Updated:2026-05-05 06:09:20  IST  )

పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలు, భవానీపూర్‌లో సీఎం మమతా బెనర్జీ ఓటమిపై సీపీఐ ప్రధాన కార్యదర్శి డి. రాజా స్పందించారు.

వామపక్షాలు మళ్లీ పుంజుకోవడం కష్టమే.. CPI చీఫ్ సెక్రటరీ డి.రాజా కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: కేరళం (Keralam), పశ్చిమ బెంగాల్ (West Bengal) అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అధికార పార్టీల ఆశలపై నీళ్లుచల్లాయి. భవానీపూర్ నియోజకవర్గంలో ఏకంగా సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee) ఓటమిపై సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా (D Raja) ఆసక్తిర వ్యాఖ్యలు చేశారు. పదవిలో ఉన్న ముఖ్యమంత్రి తన సొంత స్థానాన్ని కోల్పోవడం అనేది చాలా పెద్ద విషయమని తెలిపారు. ఈ పరిణామంపై మమత బెనర్జీ స్వయంగా విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పశ్చిమ బెంగాల్‌, కేరళలో మళ్లీ పుంజుకోవడం వామపక్షాలకు పెను సవాలేనని కామెంట్ చేశారు. బెంగాల్‌లో లెఫ్ట్ పార్టీలు తిరిగి జీవం పోసుకుని, బలోపేతం కాకపోతే అది మనుగడకే ప్రమాదమని అన్నారు. వామపక్షాలు పునరుద్ధరించబడటం దేశానికి అత్యవసరమని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన కేంద్ర ఎన్నికల సంఘం (ECI) తీరును కూడా ఆయన తప్పుబట్టారు. ప్రస్తుత తరుణంలో ఎన్నికల సంఘంపై ప్రజల్లో, ప్రతిపక్ష నేతల్లో ఉన్న విశ్వసనీయత తగ్గిపోయిందని అన్నారు. దానిని తిరిగి నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఈసీపై కూడా ఉందని రాజా స్పష్టం చేశారు.

Next Story