ముఖ్యమంత్రి ఇంట్లో IT దాడులు

by Gantepaka Srikanth |   (  Updated:2025-01-30 16:24:40  IST  )

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు(Delhi Assembly Elections) దగ్గరపడుతున్న వేళ దేశ రాజకీయాల్లో ఆసక్తకర పరిణామం చోటుచేసుకుంది.

ముఖ్యమంత్రి ఇంట్లో IT దాడులు
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు(Delhi Assembly Elections) దగ్గరపడుతున్న వేళ దేశ రాజకీయాల్లో ఆసక్తకర పరిణామం చోటుచేసుకుంది. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్(Punjab CM Bhagwant Mann) ఇంట్లో ఐటీ(IT Searches) అధికారులు దాడులకు దిగారు. పంజాబ్ నుంచి ఢిల్లీ ఎన్నికలకు డబ్బు, మద్యం పంపిణీ చేస్తున్నారని వచ్చిన ఆరోపణల నేపథ్యంలో తనిఖీలు చేస్తున్నారు. ఏకకాలంలో ఆయనకు సంబంధించిన ఆఫీసులు, ఇళ్లు, బంధువుల ఇళ్లలోనూ అధికారులు బృందాలుగా ఏర్పడి సోదాలు జరుపుతున్నారు. దీంతో ఆప్ నేతలు, కార్యకర్తల్లో కొత్త టెన్షన్ మొదలైంది. ఎప్పుడు ఎవరి ఇళ్లు, ఆఫీసుల్లో దాడులు జరుగుతాయో తెలియక టెన్షన్ పడుతున్నట్లు సమాచారం.


ఇదిలా ఉండగా.. ఈ ఎన్నికల్లో వరుసగా మరోసారి అధికారం చేజిక్కించుకోవాలని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) చాలా ప్లాన్‌డ్‌గా ముందుకు వెళ్తోంది. బీజేపీ కూడా ఈసారి కచ్చితంగా అధికారంలోకి రావాలని ఎత్తుకు పైఎత్తులు వేస్తోంది. ఈ నేపథ్యంలోనే కేజ్రీవాల్ పాలనకు గండికొట్టి.. ఢిల్లీ అధికార పీఠాన్ని అందుకోవాలని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. దీంతో ఈ రెండు పార్టీల మధ్య ప్రధాన పోరు జరగనుంది. అలాంటి వేళ ఆప్ సీఎం ఇంట్లో దాడులు జరుగడం హాట్‌టాపిక్‌గా మారింది మరోవైపు.. బీజేపీ, ఆప్ మధ్య యమునా నది అంశం చర్చనీయాంశంగా మారింది. గత ఎన్నికల వేళ తమ పార్టీ అధికారంలోకి వస్తే యమునా నదిని క్లీన్ చేస్తామంటూ ఢిల్లీ నగర ప్రజలకు ఆప్ అధినేత హామీ ఇచ్చారు. అలా అధికారంలోకి వచ్చిన తర్వాత చోటుచేసుకున్న అనూహ్య పరిణామాలతో ఆయన హామీని మరిచిపోయారు. దీనిని బీజేపీ విస్తృతంగా వాడుతోంది. మరోవైపు.. ఈ అంశంపై బీజేపీకి ఆప్ నేతలు కూడా ఘాటుగానే కౌంటర్లు ఇస్తున్నారు.

ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో ఫిబ్రవరి 5న పోలింగ్‌ జరుగనుంది. అదే నెల 8న ఓట్ల లెక్కింపు జరగనుంది. దీంతోపాటు ఉత్తర్‌ ప్రదేశ్‌లోని మిల్కీపుర్, తమిళనాడులోని ఈరోడ్‌కూ ఉప ఎన్నికలు జరుగనున్నాయి. మంచు కారణంగా కశ్మీర్‌లోని బడ్గాం, నగ్రోటాలకు తర్వాత పోలింగ్‌ జరుపుతామన్నారు. పశ్చిమ బెంగాల్‌లోని బసీర్‌హాట్, గుజరాత్‌లోని విసవదర్‌ లోక్‌సభ నియోజకవర్గాలపై కోర్టులో పిటిషన్లు ఉన్నాయని, వాటికి ఉప ఎన్నికలను నిర్వహించడం లేదని వివరించారు. ఢిల్లీలో 1.55 కోట్ల మంది ఓటర్లున్నారు. అందులో 83.49 లక్షల మంది పురుషులు కాగా 71.74 లక్షల మంది మహిళలు. 1,261 మంది ట్రాన్స్‌జెండర్లు. మొత్తం ఓటర్లలో 25.89 లక్షల మంది యువ ఓటర్లున్నారు. వారిలో 2.08 లక్షల మంది తొలిసారి ఓటు వేయనున్నారు.

Next Story