- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నటి శిల్పాశెట్టి ఇంట్లో ఐటీ సోదాలు
by Naga Rani Yarlagadda |
బాలీవుడ్ నటి శిల్పాశెట్టి ఇంటిలో ఐటీశాఖ అధికారులు సోదాలు చేసినట్లు తెలుస్తోంది.

X
దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ నటి శిల్పాశెట్టి ఇంటిలో ఐటీశాఖ అధికారులు సోదాలు చేసినట్లు తెలుస్తోంది. బెంగళూరులో ఆమెకి చెందిన బాస్టియన్ రెస్టారెంట్ కు సంబంధించిన కేసులో ఈ దాడులు చేసినట్లు సమాచారం. రెస్టారెంట్ పై కేసు నమోదైన మరుసటి రోజునే ఈ సోదాలు జరగడం గమనార్హం. ముంబైలో ఉన్న శిల్పాశెట్టి ఇంటితో పాటు.. పలు ప్రాంతాల్లోనూ సోదాలు జరిగినట్లు వార్తలొచ్చాయి.
కానీ.. శిల్పా నివాసంలో ఐటీ దాడులు జరిగాయని వచ్చిన వార్తల్ని ఆమె లాయర్ ప్రశాంత్ పాటిల్ ఖండించారు. తన క్లెయింట్ శిల్పాశెట్టి కుంద్రా ఇంటిలో ఎలాంటి ఐటీ దాడులు జరగలేదని, ఇది రొటీన్ వెరిఫికేషన్ మాత్రమేనని పేర్కన్నారు. రెస్టారెంట్ కేసు ఫాలో అప్ కోసం అధికారులు రోజూ తనిఖీలు చేస్తున్నారని, ఇవి ఐటీ దాడులు కావని తెలిపారు.
Next Story






