- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సివిల్ జడ్జి జూనియర్ డివిజన్ పోస్టుల ఇష్యూ.. సుప్రీం కోర్టు కీలక తీర్పు
సుప్రీం కోర్టు (Supreme Court) సివిల్ జడ్జి జూనియర్ డివిజన్ పోస్టుల విషయంలో దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక తీర్పును వెలువరించింది.

దిశ, వెబ్‌డెస్క్: సుప్రీం కోర్టు (Supreme Court) సివిల్ జడ్జి జూనియర్ డివిజన్ పోస్టుల విషయంలో దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక తీర్పును ఇవాళ వెలువరించింది. సంబంధిత పోస్టుకు న్యాయవాదిగా కనీసం మూడు సంవత్సరాల అనుభవాన్ని తప్పనిసరి చేసింది. ఈ మేరకు భారత ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయి (BR Gawai), ఏజీ మసీహ్ (AG Messiah), వినోద్ చంద్రన్ (Vinod Chandran) త్రిసభ్య ధర్మాసనం తీర్పునిచ్చింది. విచారణ సందర్భంగా ధర్మాసనం కీలక విషయాలను వెల్లడించింది. కొత్త లా గ్రాడ్యుయేట్ల నియామకం వల్ల అనేక సమస్యలు తలెత్తాయని పేర్కొన్నారు. అందుకే న్యాయ వ్యవస్థలోకి ప్రవేశించే అభ్యర్థులకు కనీసం మూడు సంవత్సరాల అనుభవం తప్పనిసరి బెంచ్ తెలిపింది.
కోర్టు ఆదేశాల ప్రకారం.. అనుభవ కాలం తాత్కాలిక నమోదు తేదీ నుంచి లెక్కించవచ్చని పేర్కొన్నారు. అయితే, ఈ షరతు హైకోర్టులు ప్రారంభించిన నియామక ప్రక్రియలకు వర్తించదని.. భవిష్యత్తు నియామకాలకు మాత్రమే వర్తిస్తుందని తెలిపారు. కనీసం పదేళ్ల అనుభవం ఉన్న న్యాయవాది జారీ చేసిన సర్టిఫికెట్, సంబంధిత జ్యుడీషియల్ అధికారి ధృవీకరణతో సివిల్ జడ్జి జూనియర్ డివిజన్ పోస్టు (Civil Judge Junior Division Post)ల నియామకాలను చేపట్టాలని సూచించారు. సుప్రీం కోర్టు లేదా హైకోర్టులో ప్రాక్టీస్ చేసే న్యాయవాదుల విషయంలో, కోర్టు నామినేట్ చేసిన అధికారి ధృవీకరణతో, కనీసం పదేళ్ల అనుభవం ఉన్న న్యాయవాది సర్టిఫికెట్ సరిపోతుందని అన్నారు. లా క్లర్క్‌గా అనుభవం వారు కూడా ఇందులో భాగస్వాములేనని కోర్టు తెలిపింది.
కాగా, చాలా రాష్ట్రాల్లో కనీసం మూడేళ్ల ప్రాక్టీస్ ఉన్న న్యాయవాదులు మాత్రమే న్యాయ సేవలకు దరఖాస్తు చేసుకోవచ్చనే షరతు ఉండేది. 2002లో, సుప్రీం కోర్టు కనీస ప్రాక్టీస్ అవసరాన్ని తొలగించింది. దీంతో కొత్త లా గ్రాడ్యుయేట్లు మున్సిఫ్-మేజిస్ట్రేట్ పోస్టులకు దరఖాస్తు చేసుకోగలిగారు. అయితే, తర్వాత కేవలం న్యాయవాదులకు మాత్రమే అవకాశం కల్పించాలని కోరుతూ.. సుప్రీం కోర్టులో దరఖాస్తులు దాఖలయ్యాయి. అనేక హైకోర్టులు కూడా కనీస ప్రాక్టీస్ అవసరాన్ని పునరుద్ధరించాలనే చర్యకు మద్దతు తెలిపాయి. కోర్టు 2025 జనవరి 28న ఈ దరఖాస్తులపై తీర్పును రిజర్వ్ చేసింది. అనంతరం కనీస సర్వీస్ షరతు లేకుండా గుజరాత్ హైకోర్టు ప్రారంభించిన నియామక ప్రక్రియపై కోర్టు నిషేధం విధించింది.






