అమెరికాలో పెట్టుబడి పెట్టేవారికి 'గోల్డ్ కార్డు' వీసా జారీ

by Yella Dhawani Reddy |

డోనాల్డ్ ట్రంప్ (Donald Trump) అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతులు తీసుకున్నప్పటికీ నుంచి అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే.

అమెరికాలో పెట్టుబడి పెట్టేవారికి గోల్డ్ కార్డు వీసా జారీ
X

దిశ, వెబ్ డెస్క్: డోనాల్డ్ ట్రంప్ (Donald Trump) అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతులు తీసుకున్నప్పటికీ నుంచి అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. వలసల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్న ట్రంప్.. అమెరికా పౌరసత్వం విషయంలో కొత్త పథకం రూపొందించారు. అమెరికాలో పెట్టుబడిదారుల పౌరసత్వానికి 'గోల్డ్ కార్డు (Gold Card)' వీసాలను అందించనున్నట్లు ప్రకటించారు. అగ్రరాజ్యంలో 5 మిలియన్‌ డాలర్లు (భారత కరెన్సీ ప్రకారం దాదాపు 44కోట్లు) పెట్టుబడి పెట్టేవారికి ఈ వీసాలను మంజూరుచేయనున్నట్లు వెల్లడించారు.

ఈ మేరకు అమెరికాలో పెట్టుబడిదారుల కోసం 35 ఏళ్ల క్రితం ప్రవేశపెట్టిన ఈబీ-5 వీసా పాలసీని మార్చే యోచనలో ఉన్నట్టు ట్రంప్‌ తెలిపారు. గోల్డ్ కార్డు వీసాను పొందే వ్యక్తులు అమెరికాలో ధనవంతులై ప్రభుత్వానికి పన్నులు చెల్లించే అవకాశం ఉందన్నారు. అలాగే, చాలా మందికి ఉపాధి కూడా దొరుకుతుందని తాము భావిస్తున్నామని ట్రంప్‌ చెప్పారు. అంతేకాదు, ఈ వీసా గ్రీన్ కార్డు తరహా సౌలభ్యాలను ఇస్తుందని, ఇది అమెరికన్ పౌరసత్వానికి ఒక మార్గం కాబోతుందన్నారు. ఈనేపథ్యంలో తాజాగా అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్​ సమక్షంలో ఓవల్ కార్యాలయంలో ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతక చేశారు. దీనికి సంబంధించిన వివరాలను మరో రెండు వారాల్లో వెల్లడిస్తామని తెలిపారు.

ఈబీ-5 వీసా అంటే ఏంటి?

ఈబీ-5 ఇమ్మిగ్రెంట్ ఇన్వెస్టర్ వీసా ప్రోగ్రామ్ యునైటెడ్ స్టేట్స్‌లోని ఐదు ఉపాధి-ఆధారిత (EB) ప్రాధాన్యత కార్యక్రమాలలో ఒకటి. విదేశీ పెట్టుబడిదారుల మూలధన పెట్టుబడుల ద్వారా యూఎస్ ఆర్థిక వ్యవస్థను ఉత్తేజపరచడానికి 1990లో ఏర్పాటు చేసింది. యూఎస్ సిటిజెన్​షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈబీ-5 ప్రోగ్రామ్ కింద.. పెట్టుబడిదారులు, వారి జీవిత భాగస్వాములు, 21 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న అవివాహిత పిల్లలు నాన్-టార్గెటెడ్ ఎంప్లాయిమెంట్ ఏరియా (TEA) ప్రాజెక్టులో 1.8 మిలియన్ డాలర్లు లేదా టీఈఏ ప్రాజెక్టులో కనీసం 800,000 డాలర్లు పెట్టుబడి పెడితే శాశ్వత నివాసానికి అర్హులు. పెట్టుబడిదారుడు అర్హత కలిగిన యూఎస్ కార్మికుల కోసం కనీసం 10 శాశ్వత, ఫుల్​ టైమ్​ ఉద్యోగాలను సృష్టించాలి.

Next Story