- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ISS: ఐఎస్ఎస్‌కు ఇప్పటివరకు ఎంత మంది వెళ్లారంటే?
భారత్‌కు చెందిన అస్ట్రోనాట్ శుభాంశు శుక్లా ఐఎస్ఎస్ లో అడుగుపెట్టాడు. దాదాపు 40 ఏళ్ల తర్వాత భారతీయుడు ఐఎస్ఎస్‌కు వెళ్లాడు.

దిశ, నేషనల్ బ్యూరో: భారత్‌కు చెందిన అస్ట్రోనాట్ శుభాంశు శుక్లా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ఐఎస్ఎస్)లో అడుగుపెట్టాడు. దాదాపు 40 ఏళ్ల తర్వాత ఓ భారతీయుడు ఐఎస్ఎస్‌కు వెళ్లాడు. 14 రోజుల పాటు అక్కడే ఉండనున్న శుక్లా అనేక శాస్త్రీయ ప్రయోగాలు చేయనున్నారు. దీంతో ఐఎస్ఎస్ గురించి పెద్ద ఎత్తున సర్వత్రా చర్చ జరుగుతోంది. అంతరిక్ష కేంద్రం అంటే ఏమిటి? వ్యోమగాములు అక్కడ ఏమి చేస్తారు? దానిని ఎలా నిర్మించారు? ప్రయోగాలు ఎలా చేస్తారు? అనే డిస్కషన్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఐఎస్ఎస్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఐఎస్ఎస్ అంటే?
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) అనేది ఒక భారీ అంతరిక్ష ప్రయోగశాల. ఇది భూమి దిగువ కక్ష్యలో ఉంది. దీనిని అమెరికాకు చెందిన నేషనల్ అస్ట్రోనాట్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా), రష్యాకు చెందిన రోస్కోస్మోస్, జపాన్, యూరప్, కెనడాకు చెందిన అంతరిక్ష సంస్థలు నిర్వహిస్తున్నాయి. ఈ స్టేషన్ ఆస్ట్రోబయాలజీ, ఖగోళ శాస్త్రం, వాతావరణ శాస్త్రం, భౌతిక శాస్త్రం, ఇతర రంగాలలో శాస్త్రీయ పరిశోధనలను నిర్వహించే సూక్ష్మ గురుత్వాకర్షణ, అంతరిక్ష పర్యావరణ పరిశోధన ప్రయోగశాలగా పనిచేస్తుంది. ఈ స్టేషన్ రెండు విభాగాలుగా విభజించబడింది. మొదటిది రష్యన్ ఆర్బిటల్ సెగ్మెంట్ (ROS) నిర్వహిస్తుండగా రెండోది అమెరికా నిర్వహిస్తోంది. దీని ప్రధాన నిర్మాణం 1998- 2011 మధ్య పూర్తైంది. అప్పటి నుంచి నిరంతరం కొత్త మిషన్లు, ప్రయోగాలు చేయడానికి వేదికగా మారింది. ఐఎస్ఎస్ పని చేయడానికి నాసా ఏడాదికి మూడు బిలియన్లు ఖర్చు చేస్తుంది.
2000లో మొదటి బృందం
2000 నవంబర్ 2న మొదటి బృందం ఐఎస్ఎస్‌కి చేరుకుంది. అప్పటి నుంచి వ్యోమగాములు నిరంతరం ఐఎస్ఎస్ కి పయనించి అనేక పరిశోధనలు చేస్తున్నారు. మే 2002 నాటికి 20 దేశాల నుంచి 258 మంది అస్ట్రోనాట్స్ ఐఎస్ఎస్‌ను సందర్శించారు. ఎక్కువగా అమెరికా నుంచి 158, రష్యా నుంచి 54 మంది ఐఎస్ఎస్‌కు వెళ్లారు. అనేక పరిశోధనలు చేశారు. ఈ శాస్త్రీయ పరిశోధనలు ఎంతగాలో ఉపయోగపడ్డాయి.
ఐఎస్ఎస్‌లో వ్యోమగాములు ఏం చేస్తారు?
ఐఎస్ఎస్‌కు చేరుకున్న తర్వాత, వ్యోమగాములు శాస్త్రీయ పరిశోధనలు చేపడతారు. కొత్త సాంకేతికలను పరీక్షించడం వాటిని అభివృద్ధి చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై రీసెర్చ్ చేస్తారు. అక్కడ జీవం ఎలా ఎదుగుగుంతో అనే విషయాలపైనా పరిశోధిస్తారు. అంతరిక్ష కేంద్ర ప్రయోగశాలలు సిబ్బంది సభ్యులు మరెక్కడా చేయలేని పరిశోధనలు చేయడానికి అనుమతిస్తాయి. ఈ శాస్త్రీయ పరిశోధన భూమిపై ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తుంది.ఇప్పటికే ఐఎస్ఎస్ భాగస్వాములు అంతరిక్ష ప్రయోగాలు చేయడంలో రాటు దేలారు. దీంతో భవిష్యత్ లో మరిన్ని ఆశాజనకమైన ప్రయోగాలు చేయనున్నారు.






