- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారత ఉపగ్రహంలో లోపం
ఆ థ్రస్టర్లను పని చేయించడానికి నిరంతరం ప్రయత్నిస్తున్నా సాంకేతి సమస్యలు ఎదురవుతున్నాయని అన్నారు.

- ఇటీవలే అంతరిక్షంలోకి పంపిన ఇస్రో
- నిర్ణీత కక్ష్యలో పెట్టడానికి సాంకేతిక సమస్యలు
- అడ్డంకులు అధిగమించడానికి ప్రయత్నిస్తున్న సైంటిస్టులు
దిశ, నేషనల్ బ్యూరో:
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఇటీవలే తన 100వ ప్రయోగం ద్వారా ఎన్వీఎస్ 02 ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపిన విషయం తెలిసిందే. యూఆర్ రావు శాటిలైట్ సెంటర్ తయారు చేసిన ఈ ఉపగ్రహాన్ని ఇండియా భూభాగం పైన, భూస్థిర కక్ష్యలోకి చేర్చడానికి సాంకేతిక లోపాలు ఎదురవుతున్నట్లు ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. శాటిలైట్‌లోని లిక్విడ్ ఇంజన్ సరిగా పని చేయకపోవడంతో దాన్ని భూస్థిర కక్ష్యలో ప్రవేశపెట్టడానికి ఆలస్యం అవుతుందని అన్నారు. ఆ థ్రస్టర్లను పని చేయించడానికి నిరంతరం ప్రయత్నిస్తున్నా సాంకేతి సమస్యలు ఎదురవుతున్నాయని అన్నారు. ఇదిలాగే కొనసాగితే ఆ శాటిలైట్జ్‌ను పూర్తిగా వదిలేయాల్సి వస్తుందని ఇస్రో ఆందోళన వ్యక్తం చేసింది. శాటిలైట్‌లోని వ్యవస్థలన్నీ పని చేస్తున్నాయి. ప్రస్తుతం దీర్ఘవృత్తాకార కక్ష్యలో పరిభ్రమిస్తోంది. అయితే ప్రస్తుతానికి అందుబాటులో ఉన్న వ్యూహాలను ఉపయోగించి దీర్ఘ వృత్తాకార కక్ష్యలో తిరిగేలా చూస్తున్నామని ఇస్రో చెప్పింది. కాగా.. ఎన్వీఎస్ 2 ఉపగ్రహం అతి దీర్ఘ వృత్తాకార కక్ష్యలో తిరుగుతుండటంతో దానికి కేటాయించిన పనులను చేయించడం క్షంగా ఉందని ఇస్రో చెబుతోంది.






