భారతీయ అంతరిక్ష స్టేషన్ మోడల్‌ ఇదే!

by Phanindra |

భారతీయ అంతరిక్ష స్టేషన్ మోడల్‌ ఇదే. నేషనల్ స్పేస్ డే వేడుకల్లో ఆవిష్కరించిన ఇస్రో.

భారతీయ అంతరిక్ష స్టేషన్ మోడల్‌ ఇదే!
X

దిశ, నేషనల్ బ్యూరో: నేషనల్ స్పేస్ డే వేడుకల్లో భాగంగా భారత్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న భారతీయ అంతరిక్ష స్టేషన్ (బీఏఎస్) మోడల్‌ను ఇస్రో ఆవిష్కరించింది. ఈ వేడుకల్లో బీఏఎస్-01 మాడ్యూల్ నమూనా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేస్తున్న బీఏఎస్‌లోని తొలి మాడ్యూల్‌ను 2028 నాటికల్లా లాంచ్ చేయాలని భారత్ ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతం అంతరిక్షంలో రెండు ఆర్బిటల్ ల్యాబొరేటరీలు ఉన్నాయి. ఐదు స్పేస్ ఏజెన్సీలు కలిపి నిర్వహించే అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ (ఐఎస్ఎస్), చైనాకు చెందిన టియాంగాంగ్. వీటి సరసన చేరేలా 2035 నాటికి ఐదు మాడ్యూల్స్‌ను అంతరిక్షంలోకి పంపేందుకు భారత్ సిద్ధమవుతోంది.

Next Story