- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గగన్‌యాన్‌లో కీలక ఐఏడీటీ ప్రయోగం సక్సెస్: ఇస్రో
గగన్‌యాన్‌లో కీలక ఐఏడీటీ ప్రయోగం సక్సెస్ అయిందని ఇస్రో తెలిపింది. క్రూ మాడ్యూల్ ల్యాండింగ్‌కు ఈ ప్రయోగం చాలా కీలకం.

దిశ, నేషనల్ బ్యూరో: గగన్‌యాన్-1 మిషన్‌లో కీలక ఘట్టానికి ఇస్రో సిద్ధమైంది. ఈ ఏడాది డిసెంబరులో అన్‌క్రూడ్ టెస్ట్ ఫ్లయిట్‌ను అంతరిక్షంలోకి పంపనున్న ఇస్రో.. దీని కోసం తొలి ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డ్రాప్ టెస్ట్ (ఐఏడీటీ-01)ను విజయవంతంగా పూర్తిచేసింది. వ్యోమగాములు భూమ్మీదకు తిరిగి రావడానికి అవసరమైన భద్రతలో ఈ దశ చాలా కీలకమైంది. అందుకే దీనిపై ఇస్రో బాగా ఫోకస్ పెట్టింది. ఈ ప్రయోగం కోసం ఎయిర్ ఫోర్స్, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీవో), నేవీ, కోస్ట్ గార్డ్ సహకారం తీసుకుంది.
క్రూ ఉండే మాడ్యూల్ తిరిగి భూ వాతావరణంలోకి ప్రవేశించిన తర్వాత దాన్ని జాగ్రత్తగా ల్యాండ్ చేయడానికి వఅవసరమై పారాచ్యూట్ వ్యవస్థను ఇస్రో పరీక్షించింది. ఒక మాడ్యూల్ నమూనాను ఎయిర్‌క్రాఫ్ట్‌లో సుమారు 4 కిలోమీటర్ల ఎత్తుకు తీసుకెళ్లి రిలీజ్ చేశారు. అనంతరం పారాచ్యూట్ వ్యవస్థ ఒక్కొ్క్కటిగా విడుదలై మాడ్యూల్‌ను సురక్షితంగా ల్యాండ్ చేశాయి. ఈ పరీక్ష సక్సెస్ అయిన విషయాన్ని ఇస్రో తన ఎక్స ఖాతాలో వెల్లడించింది.






