ISRO's 100th Rocket Launch : అంతరిక్షంలో సెంచరీకి సిద్ధమైన ఇస్రో !

by Y. Venkata Narasimha Reddy |   (  Updated:2025-01-28 12:35:53  IST  )

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ISRO) రేపు బుధవారం వందో రాకెట్(100TH ROCKET)ప్రయోగానికి సిద్ధమైంది. నింగిలోకి జీఎస్ఎల్వీ ఎఫ్-F15(GSLV-F15) రాకెట్ ప్రయోగానికి సన్నాహాలు పూర్తి చేసి కౌంట్ డౌన్ ప్రారంభించింది. వందో రాకెట్ ప్రయోగ వేళ ఇస్రో చైర్మన్ నారాయణన్(ISRO Chairman Narayanan) తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

ISROs 100th Rocket Launch  : అంతరిక్షంలో సెంచరీకి సిద్ధమైన ఇస్రో !
X

దిశ, వెబ్ డెస్క్ : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ISRO) రేపు బుధవారం వందో రాకెట్(100TH ROCKET)ప్రయోగానికి సిద్ధమైంది. నింగిలోకి జీఎస్ఎల్వీ ఎఫ్-F15(GSLV-F15) రాకెట్ ప్రయోగానికి సన్నాహాలు పూర్తి చేసి కౌంట్ డౌన్ ప్రారంభించింది. వందో రాకెట్ ప్రయోగ వేళ ఇస్రో చైర్మన్ నారాయణన్(ISRO Chairman Narayanan) తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అలాగే చెంగాళమ్మ పరమేశ్వరి దేవి అమ్మవారిని దర్శించుకున్నారు. రాకెట్ ప్రయోగం విజయవంతం కావాలని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఇస్రో తొలినాళ్లలో రాకెట్ ప్రయోగాలపై విదేశాలపై ఆధారపడే స్థాయి నుంచి నేడు విదేశాలకు రాకెట్ ప్రయోగాల్లో సాంకేతిక సహకారం అందించే స్థాయికి చేరుకోవడం భారతీయులకు గర్వకారణంగా నిలిచింది. ఎప్పటికప్పుడు తన స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకుంటూ వస్తున్న ఇస్రో నేడు ప్రపంచంలో ఓ అత్యుత్తమ అంతరిక్ష సంస్థగా ఎదిగింది. తొలిరోజుల్లో సంవత్సరానికి ఒక ప్రయోగాన్ని నిర్వహించే స్థాయి నుంచి కనీసం నాలుగు నుంచి పది ప్రయోగాలు చేపట్టే స్థాయికి ఇస్రో అభివృద్ధి సాధించింది. భవిష్యత్తుల ప్రయోగాల సంఖ్యను 15కు పెంచేలా షార్‌లో మౌలిక వసతులు ఏర్పాటు చేస్తుండటం విశేషం.

ఇటీవలే ఇస్రో నూతన సంవత్సర ప్రారంభంలోనే మరో సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇటీవల నింగిలో శాటిలైట్ డాకింగ్(రెండు ఉపగ్రహాల అనుసంధానం)లో, విత్తనాలు మొలకెత్తేలా చేయడంతో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ విజయం సాధించింది. ఇప్పటివరకు చైనా, రష్యా, అమెరికా మాత్రమే అంతరిక్షంలో రెండు ఉపగ్రహాలను అనుసంధానం చేస్తున్నాయి. తాజా ప్రయోగంతో ఈతరహా సాంకేతికతలో భారత్‌ కూడా వాటి సరసన చేరింది. రాకెట్ ప్రయోగాలతో ఇస్రో ఇప్పటికే ఎన్నో ఘనతలను సాధించగా.. ఇప్పుడు సరికొత్త రికార్డు సృష్టించబోతోంది. ఇస్రో తన 100వ రాకెట్‌ను ప్రయోగించి విజయాన్ని తన ఖాతాలో వేసుకోనుంది. ఇస్రో ఈ రాకెట్‌కి జీఎస్‌ఎల్‌వీ ఎఫ్15 అని పేరు పెట్టింది. ఈ రాకెట్ రెండు NVS-02 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపనుంది.

ప్రత్కేకతలు ఇవే..

రేపు బుధవారం శ్రీహరి కోటలో శాటిలైట్లను మోసుకెళ్లే 100వ రాకెట్ ను నింగిలోకి ఇస్రో పంపిస్తుంది. ఉదయం 6 గంటల 23 నిమిషాలకు GSLV-F15 రాకెట్ నింగిలోకి వెళ్లనుంది. రాకెట్ ద్వారా ఈసారి నింగిలోకి NVS 02 శాటిలైట్ వెళ్లనుంది. ఇది నావిక్ రెండో సిరీస్‌కి సంబందించినది. ఇది ఇచ్చే సమాచారం.. మ్యాప్‌లకు బాగా ఉపయోగపడుతుంది. భూమి, ఆకాశం, నీటిపై ప్రయాణాలకు ఈ శాటిలైట్ దారి చూపిస్తుంది. ఇది మొత్తం 2,250 కేజీల బరువు ఉన్న శాటిలైట్. ఇది భూ కక్ష్యా మార్గంలోకి వెళ్లాక.. GPS సేవల్ని అందిస్తుంది. ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దేశీయ నావిగేషన్‌ వ్యవస్థ నావిక్‌లో ఇది మరో కీలక ప్రయోగం.

GSLV-F15 రాకెట్‌ జీఎస్‌ఎల్వీ సిరీస్‌లో 17వది. దేశీయ క్రయోజెనిక్‌ స్టేజ్‌ ఉన్న 11వ రాకెట్‌. ఈ ప్రయోగం ద్వారా NVS-02 ఉపగ్రహాన్ని జియోసింక్రనస్‌ ట్రాన్స్‌ఫర్‌ ఆర్బిట్‌లోకి ప్రవేశపెడతారు. దీని ద్వారా దేశీయ నావిగేషన్‌ వ్యవస్థ నావిక్‌ మరింత విస్తృతం కానున్నది. ఈ ఉపగ్రహం సెకండ్‌ జెనరేషన్‌ శాటిలైట్‌ కాగా.. ఎన్‌వీఎస్‌-01 ఉపగ్రహాన్ని 29 మే 2023న ఇస్రో నింగిలోకి పంపింది. ఈ ఎన్‌వీఎస్‌-02 ఉపగ్రహం ఈ సిరీస్‌లో రెండో ఉపగ్రహం. ఇందులో ఎల్‌1, ఎల్‌5, ఎస్‌ బ్యాండ్‌లలో నావిగేషన్‌ పేలోడ్లతో పాటు సీబ్యాండ్‌ రేజింగ్‌ పేలోడ్స్‌ ఉంటాయి. నావిక్‌ అనేది భారతదేశ స్వతంత్ర ప్రాంతీయ నావిగేషన్‌ ఉపగ్రహ వ్యవస్థ. అమెరికాకు చెందిన జీపీఎస్‌కు ఇది ప్రత్యామ్నాయం. భారత భూభాగం నుంచి దాదాపు 1500 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్న ప్రాంతాల్లో వినియోగదారులకు ఖచ్చితమైన స్థానం, వేగం, సమయం సేవలను అందించడం దీని ఉద్దేశం.

Next Story