- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ISRO: 2035లో భారత్‌కు సొంత అంతరిక్ష కేంద్రం.. ఇస్రో చీఫ్ నారాయణన్
2035 నాటికి సొంత అంతరిక్ష కేంద్రం ఉంటుందని ఇస్రో చీఫ్ నారాయణన్ అన్నారు. 2028 నాటికి మొదటి మాడ్యూల్ ప్రారంభమవుతుందని తెలిపారు.

దిశ, నేషనల్ బ్యూరో: 2035 నాటికి భారత్‌కు సొంత అంతరిక్ష కేంద్రం ఉంటుందని ఇస్రో చీఫ్ నారాయణన్ (Narayanan) అన్నారు. 2028 నాటికి మొదటి మాడ్యూల్ ప్రారంభమవుతుందని తెలిపారు. నెక్స్ట్ జనరేషన్ లాంచర్‌కు ప్రధాని మోడీ ఆమోదం తెలిపారని, 2040 నాటికి ఇండియా చంద్రునిపై అడుగుపెడుతుందని దీమా వ్యక్తం చేశారు. నేషనల్ స్పేస్ డే సందర్భంగా న్యూఢిల్లీలోని భారత్ మండపంలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. 2040 నాటికి భారత అంతరిక్ష కార్యక్రమం ప్రపంచంలోని ఇతర అంతరిక్ష ప్రోగ్రామ్స్‌కు సమానంగా ఉంటుందని చెప్పారు. ‘దేశ వ్యోమగాములలో ఇకరిని ఐఎస్ఎస్‌కు పంపడం అతి పెద్ద విజయం. దీనికి గాను ప్రధాని మోడీకి కృతజ్ఞతలు. మన సొంత రాకెట్‌తో అస్ట్రోనాట్స్‌ను అంతరిక్షంలోకి పంపే ముందు ఒకరిని ఐఎస్ఎస్‌కు పంపాలనేది ఆయన ఆలోచన. దీని కారణంగానే మనకు గొప్ప విజయం లభించింది. శుభాంశు శుక్లా ఐఎస్ఎస్‌కు వెళ్లి సురక్షితంగా తిరిగొచ్చారు. ఆయన ముగ్గురు సహోద్యోగులను మరచిపోలేం’ అని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమానికి వ్యోమగామి శుభాంశు శుక్లా, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తదితరులు హాజరయ్యారు.
దేశ అంతరిక్ష రంగం యువ భారతీయులకు స్పూర్తి: ప్రధాని మోడీ
జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ వర్చువల్‌గా ప్రసంగించారు. దేశ అంతరిక్ష రంగం యువ భారతీయులకు స్పూర్తి అని కొనియాడారు. ఆర్యభట్ట నుంచి గగన్‌యాన్ వరకు భారత్ గతంపై విశ్వాసాన్ని, భవిష్యత్ పై సంకల్పాన్ని చూపిస్తుందన్నారు. అంతరిక్ష రంగంలో మైలురాయిని అధిగమించడం భారత్ కు సహజ లక్షణంగా మారిందని తెలిపారు. భారత్ ఇప్పటికే చంద్రుడు, అంగారక గ్రహాన్ని చేరుకుందని, ప్రస్తుతం అంతరిక్షంలోని లోతైన ప్రాంతాలను అన్వేషించాలని సూచించారు. ఈ ప్రాంతాలు మానవాళి భవిష్యత్తుకు కీలకమైన రహస్యాలను కలిగి ఉన్నాయని నొక్కి చెప్పారు.






