- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎట్టి పరిస్థితుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని అంతం చేస్తాం: ఇజ్రాయెల్
ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా రోజు రోజుకు ఇరు దేశాల మధ్య పరిస్థితులు దారుణంగా మారుతున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా రోజు రోజుకు ఇరు దేశాల మధ్య పరిస్థితులు దారుణంగా మారుతున్నాయి. ఒకదేశంపై మరోదేశం మిస్సైల్ దాడులతో రెచ్చిపోతుంది. ఈ క్రమంలో ఇజ్రాయెల్‌కు తమ సత్తా చూపిస్తామని ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేని వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. తమపై దాడి చేసి ఇరాన్ తప్పు చేసిందని, తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. కాగా ఖమేనీ వ్యాఖ్యలకు ఇజ్రాయెల్ అదే రీతిలో సమాధానం ఇచ్చింది.
ఖమేనీకి భూమిపై బతికే హక్కులేదు అంటూ తీవ్ర విమర్శలు చేసింది. ఎట్టి పరిస్థితుల్లో ఖమేనీని అంతం చేస్తామని ప్రకటించింది. ఈ మేరకు ఇజ్రాయెల్ డిఫెన్స్ మినిస్టర్ ఇజ్రాయెల్ కట్జ్ వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ మిస్సైల్స్ ఓ ఆస్పత్రిపై దాడి చేయడంతో కట్జ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్ డిఫెన్స్‌కు ఆదేశాలు జారీ చేయబడ్డాయి. లక్ష్యాలు ఏంటో డిఫెన్స్‌కు తెలుసని అన్నారు. ఖమేనీని కచ్చితంగా అంతం చేయాలని వారికి తెలుసని వ్యాఖ్యానించారు. ఇటీవలే ఖమేని ఇంటికి సమీపంలో ఇజ్రాయెల్ దాడులు చేసింది. తాజా వార్నింగ్‌తో ఏం జరగబోతుందా అన్న ఉత్కంఠ మొదలైంది.






