స్నేహితులను కాల్వలోకి నెట్టి.. ఇజ్రాయేలీ టూరిస్ట్‌పై లైంగిక దాడి

by Ajay Maddhiboyina |   (  Updated:2025-03-08 16:17:18  IST  )

ఆ స్నేహితులు బృందం నైట్ క్యాంపింగ్ చేస్తుండగా.. గుర్తు తెలియన ముగ్గురు దుండగులు వాళ్ల వద్దకు వచ్చి పెట్రోల్ బంక్‌కు దారి అడిగారు.

స్నేహితులను కాల్వలోకి నెట్టి.. ఇజ్రాయేలీ టూరిస్ట్‌పై లైంగిక దాడి
X

- హోమ్ స్టే ఓనర్‌పై కూడా అత్యాచారం

- నీటిలో మునిగి ఒక స్నేహితుడి మృతి

- కర్ణాటకలోని హంపీలో దారుణం

- కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు

దిశ, నేషనల్ బ్యూరో: ముగ్గురు మగ స్నేహితులతో కలిసి నక్షత్ర వీక్షణకు వెళ్లిన ఇద్దరు యువతులపై గుర్తు తెలియని దుండగులు దారుణంగా లైంగిక దాడికి పాల్పడ్డారు. ఇందులో ఇజ్రయేల్‌కు చెందిన యువతి కూడా ఉంది. ఇద్దరు యువతులను రేప్ చేయడానికి ముందు వారి ముగ్గురు స్నేహితులపై దాడి చేయడమే కాకుండా.. పక్కన ఉన్న కాల్వలోకి తోసేశారు. ఈ ఘటనలో ఒక యువకుడు మృతి చెందాడు. ఈ దారుణ ఘటన కర్ణాటకలో ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన హంపీలో చోటు చేసుకుంది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇజ్రాలేయ్‌కు చెందిన ఒక యువతి (27), హోమ్ స్టే నిర్వహిస్తున్న మరో యువతి (29)తో పాటు మరో ముగ్గురు మగ స్నేహితులు హంపీకి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న సనాపూర్ లేక్ వద్దకు గురువారం రాత్రి నక్షత్ర వీక్షణ కోసం వెళ్లారు. ముగ్గురు యువకులు ఒడిషా, మహారాష్ట్ర, అమెరికాకు చెందిన వారు. వీళ్లందరూ డిన్నర్ ముగిసిన తర్వాత తుంగభద్ర కాలువ ఒడ్డున క్యాంపింగ్ ఏర్పాటు చేసుకున్నారు. గిటార్ ప్లే చేసుకుంటూ పాటలు పాడుతూ.. రాత్రి పూట నక్షత్రాలను చూస్తున్నారు.

ఆ స్నేహితులు బృందం నైట్ క్యాంపింగ్ చేస్తుండగా.. గుర్తు తెలియన ముగ్గురు దుండగులు వాళ్ల వద్దకు వచ్చి పెట్రోల్ బంక్‌కు దారి అడిగారు. అయితే హోమ్ స్టే ఓనర్.. పెట్రోల్ పంప్ గురించి తమకు తెలియదని చెప్పారు. ఆ తర్వాత ఆ ముగ్గురు డబ్బులు డిమాండ్ చేశారు. కానీ ఈ స్నేహితుల బృందం ఇవ్వడానికి నిరాకరించారు. దీంతో ఆ దుండగులు ముగ్గురు యువకులను చితకబాది పక్కనే ఉన్న కాల్వలోకి నెట్టేశారు. ఆ యువకులు కాల్వలో నుంచి బయటకు రావడానికి తీవ్రంగా ప్రయత్నిస్తుండగానే.. ఇద్దరు యువతులపై దుండగులు లైంగికదాడికి పాల్పడ్డారు. దుండగుల్లోని ఇద్దరు హోమ్ స్టే ఓనర్ గొంతు పట్టుకొని.. బట్టలు విప్పేసి దారుణంగా లైంగిక దాడి చేశారు. మరో దుండగుడు ఇజ్రాయేలీ యువతిని పక్కకు తీసుకెళ్లి రేప్ చేశాడు. అనంతంర దుండగులు రెండు మొబైల్ ఫోన్లు, రూ.9,500 క్యాష్ దోచుకొని పరారయ్యారు.

కాల్వలో పడిన మహారాష్ట్ర యువకుడు పంకజ్, యూఎస్‌కు చెందిన డేనియల్ బయటకు వచ్చారు. కానీ ఒడిషాకు చెందిన యువకుడు మాత్రం నీటిలో మునిగి చనిపోయాడు. ఈ ఘటన గురువారం రాత్రి 11 గంటల నుంచి 11.30 మధ్యలో జరిగింది. అయితే శనివారం ఉదయం ఒడిషా యువకుడి మృత దేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఘటన జరిగిన వెంటనే ఇద్దరు యువతులు, కాల్వలో నుంచి బయటకు వచ్చిన ఇద్దరు యువతులు కలసి దగ్గర్లో ఉన్న రిసార్టుకు వెళ్లి.. అక్కడ నుంచి పోలీసులకు కాల్ చేశారు. బాధితులు నలుగురిని పోలీసులు వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

కాగా, దుండగులు ముగ్గురు డబ్బులు అడగగా మొదటి రూ.20 వారికి ఇచ్చారు. అయితే మాకు రూ.100 కావాలని వాళ్లు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో యువకులు ఆ దుండగులతో ఘర్షణ దిగారు. ఆ తర్వాత ఆ ముగ్గురు వీరిపై దాడి చేశారని పోలీసులు తెలిపారు. బైక్ పై వచ్చిన ఆ ముగ్గురు కన్నడ, తెలుగు భాషల్లో మాట్లాడినట్లు బాధితులు తెలిపారు. పోలీసులు 309(6), 311, 70(1), 109తో పాటు మర్డర్ సెక్షన్లను నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read More ....

Gang-Rape: ఛీఛీ.. దేశ పరువు తీశారు కదరా.. ఇజ్రాయెల్ టూరిస్ట్‌పై సామూహిక అత్యాచారం!






Next Story