- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడి.. 10 మంది దుర్మరణం
లెబనాన్‌లో ఇజ్రాయెల్ దాడుల్లో హిజ్బుల్లా సీనియర్ అధికారితో సహా కనీసం 10 మంది మృతి చెందారు,

దిశ, వెబ్ డెస్క్: లెబనాన్ లో దారుణం జరిగింది. లెమన్ లోని హిజ్బుల్లా గ్రూప్ లను లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయెల్ వైమానిక దాడులకు తెగబడింది. ఈ దారుణమైన సంఘటనలో దాదాపు పది మంది మరణించారు. సీనియర్ ఫీల్డ్ కమాండర్ హిజ్బుల్లా సహా 10 మంది మొత్తం మృతి చెందారని సమాచారం అందుతోంది. అంతేకాదు దాదాపు 50 మంది అమాయకులు గాయాల బారిన పడ్డారు. ఇరు దేశాల మధ్య 2024 నవంబర్ లో కాల్పుల విరమణ ఒప్పందం అమలులోకి వచ్చిన సంగతి తెలిసిందే.
ఇజ్రాయెల్ వైమానిక దాడి.. 10 మంది మొత్తం మృతి
అయితే ఈ ఒప్పందం తర్వాత, లెబనాన్ పైన ఇజ్రాయెల్ వైమానిక దాడులకు పాల్పడింది. ఈ తరుణంలోనే మీడియా సంచలన ప్రకటన చేసింది. 2024 తర్వాత ఇదే అతిపెద్ద వైమానిక దాడి అంటూ అంతర్జాతీయ మీడియా స్పష్టం చేస్తోంది. తమ దేశంపై దాడులకు ప్రణాళికలు చేస్తున్నారనే పక్కా సమాచారం ఇజ్రాయెల్ కు వచ్చిందట. అయితే అంతకంటే ముందే రివర్స్ అటాక్ చేసినట్లు ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. ఈ సంఘటనలో పది మంది మృతి చెందడం గమనార్హం. మరి ఇజ్రాయెల్ వైమానిక దాడి చేసిన తరుణంలోనే లెబనాన్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.






