ఇరాన్ దాడుల దెబ్బకు ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థ ధ్వంసం

by Yella Dhawani Reddy |   (  Updated:2025-06-19 06:16:29  IST  )

ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి.

ఇరాన్ దాడుల దెబ్బకు ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థ ధ్వంసం
X

దిశ, వెబ్ డెస్క్: ఇజ్రాయెల్ (Isreal), ఇరాన్ (Iran) మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. గత ఏడు రోజులుగా ఇరు దేశాలు పరస్పరం భీకర దాడులకు పాల్పడుతుండగా, ఇజ్రాయెల్‌పై భయంకరమైన ఒత్తిడి నెలకొంది. ఇరాన్ ప్రతీకార దాడులను అడ్డుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తోంది. ఇరాన్ క్షిపణులు ఐరన్ డోమ్‌ను ఛేదించి విధ్వంసం సృష్టిస్తున్నాయి. ఈ దాడుల్లో ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థ పూర్తిగా ధ్వంసం అయినట్లు సమాచారం. అలాగే, పలు పట్టణాల్లో విద్యుత్, నీటి సరఫరా అంతరాయం కలిగింది. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇరాన్ దాదాపు ప్రతిరోజూ క్షిపణులను ప్రయోగిస్తూనే ఉంది.

కాగా, గతవారం ఇరాన్ అణుకేంద్రాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’ చేపట్టినప్పటి నుంచి ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి. ఇరాన్ కూడా ఇజ్రాయెల్‌పై ప్రతీకార దాడులకు దిగింది. ఇప్పటివరకు సుమారు 400 బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించినట్లు టెహ్రాన్ ప్రకటించింది.

ఇజ్రాయెల్‌ దాడుల్లో ఇప్పటిదాకా 585 మంది ప్రాణాలు కోల్పోయారని, 1,300 మంది గాయపడ్డారని ‘ఇరాన్‌ హ్యూమన్‌ రైట్స్‌ యాక్టివిస్ట్స్‌’ సంస్థ తెలిపింది. ఇక ఇరాన్ దాడుల్లో ఇప్పటివరకు 24 మంది మరణించారని, మరో 600 మంది గాయపడ్డారని నెతన్యాహు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఇరాన్ సైనిక మౌలిక వసతులను దెబ్బతీసి విజయం సాధించామని ఇజ్రాయెల్ చెబుతున్నప్పటికీ, ఈ ప్రతిదాడులను అడ్డుకోవడానికి మాత్రం ఆ దేశం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది.

Next Story