- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Israel: ఇజ్రాయెల్ దాడులపై ఆందోళన చెందుతున్నాం.. సిరియాలో దాడులపై అమెరికా
పొరుగు దేశమైన సిరియాపై ఇజ్రాయెల్ విరుచుకుపడింది. రాజధాని డమాస్కస్‌లోని సైనిక ప్రధాన కార్యాలయంపై దాడి చేసింది.

దిశ, నేషనల్ బ్యూరో: పొరుగు దేశమైన సిరియాపై ఇజ్రాయెల్ విరుచుకుపడింది. రాజధాని డమాస్కస్‌లోని సైనిక ప్రధాన కార్యాలయంపై బుధవారం దాడి చేసింది. సిరియన్ మిలిటరీ రెజిమెంట్ ప్రవేశ ద్వారంపై డ్రోన్లతో అటాక్ చేసినట్టు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) తెలిపింది. పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని వెల్లడించింది. దక్షిణ సిరియాలో డ్రూజ్ పౌరులపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను, ప్రస్తుత పరిణామాలను ఐడీఎఫ్ పర్యవేక్షిస్తూనే ఉందని పేర్కొంది. ఇజ్రాయెల్ ప్రభుత్వ సూచన మేరకే దాడులకు పాల్పడ్డామని తెలిపింది. ఈ దాడుల్లో ఒకరు మరణించగా,18 మంది గాయపడ్డారని సిరియా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
దక్షిణ సిరియాలోని సువైదా ప్రావిన్స్‌లో షియా డ్రూజ్, సున్నీ బెడౌయిన్ వర్గాల మధ్య కొద్ది రోజులుగా హింసాత్మక పోరాటం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఇరు వర్గాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. అయితే ఇది విచ్చిన్నం కావడంతో స్వీడా నగరంలో మళ్లీ ఘర్షణ మొదలైంది. ఈ క్రమంలోనే ఇజ్రాయెల్ దాడులకు పాల్పడింది. అయితే డ్రూజ్ కమ్యూనిటీని రక్షించడానికే తాము దాడులు చేస్తు్న్నామని ఇజ్రాయెల్ చెబుతోంది. ఇజ్రాయెల్ దాడులపై అమెరికా స్పందించింది. ఈ దాడులపై తాము ఆందోళన చెందుతున్నామని విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో అన్నారు.






