Israel: నిజమైన స్నేహమంటే ఇదే.. ప్రధాని మోడీపై ఇజ్రాయెల్ మంత్రి ప్రశంసలు

by B.Srinivas |

ప్రధాని నరేంద్ర మోడీపై ఇజ్రాయెల్ వ్యవసాయ మంత్రి అబ్రహం మోషే ప్రశంసలు గుప్పించారు.

Israel: నిజమైన స్నేహమంటే ఇదే.. ప్రధాని మోడీపై ఇజ్రాయెల్ మంత్రి ప్రశంసలు
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రధాని నరేంద్ర మోడీ (Narendra modi) పై ఇజ్రాయెల్ వ్యవసాయ మంత్రి అబ్రహం మోషే (Abraham moshe) ప్రశంసలు గుప్పించారు. 2023 అక్టోబర్ 7న తమ దేశంపై ఉగ్రవాద సంస్థ హమాస్ (Hamas) చేసిన దాడుల అనంతరం ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు ప్రధాని మోడీ ఫోన్ చేశారని గుర్తు చేశారు. నిజమైన స్నేహమంటే ఇదేనని కొనియాడారు. న్యూ ఢిల్లీలో మంగళవారం నిర్వహించిన రైజింగ్ భారత్ సమ్మిట్-2025 కార్యక్రమంలో భాగంగా మోషే ప్రసంగించారు. ‘అక్టోబర్ 7 రోజున ఇజ్రాయెల్‌పై భయంకరమైన దాడులు జరిగాయి. అనేక మంది ప్రజలు హింసించబడ్డారు. కొంత మంది చనిపోయారు. మరికొందరిపై అత్యాచారం జరిగింది. కిడ్నాప్‌నకు గురయ్యారు. దేశ మంతా భయంకరమైన పరిస్థితి నెలకొంది. ఆ టైంలో మొదటి సారిగా పీఎం నెతన్యాహుకు ప్రధాని మోడీ ఫోన్ చేశారు. ఇజ్రాయెల్‌కు అవసరమైన సహాయం అందించారు. అదే నిజమైన స్నేహం’ అని కొనియాడారు.

ఇజ్రాయెల్ ఒక చిన్న దేశమే అయినప్పటికీ వ్యవసాయ పరంగా అనేక వాతావరణ పరిస్థితులు ఉన్నాయన్నారు. ఎడారులు, శుష్క, పాక్షిక శుష్క ప్రాంతాలు వంటి అనేక ప్రాంతాలు ఉన్నాయని తెలిపారు. ఇది ఇజ్రాయెల్‌ను వ్యవసాయానికి ప్రయోగశాలగా చేస్తుందని, దీనిని భారతదేశానికి అందిస్తున్నామని చెప్పారు. గాజా పరిస్థితులపై మోషే స్పందిస్తూ.. యుద్ధం ప్రారంభం తర్వాత తాము మూడు లక్ష్యాలను నిర్దేశించుకున్నామని చెప్పారు. దాని ప్రకారమే యుద్ధాన్ని కొనసాగించామని చెప్పారు. ఆ లక్ష్యాలను సాధించే వరకు యుద్ధం ఆగబోదని స్పష్టం చేశారు. హమాస్ వద్ద ఇంకా 59 మంది బందీలుగా ఉన్నారని తెలిపారు.

Next Story