- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇరాన్ భద్రతా వ్యవహారాల అధిపతిని చంపేశాం: ఇజ్రాయెల్
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి పీక్స్‌కు చేరుకున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి పీక్స్‌కు చేరుకున్నాయి. ఇరాన్ అత్యున్నత జాతీయ భద్రతా మండలి (SNSC) కార్యదర్శి అలీ లారిజానీ ఇజ్రాయెల్ జరిపిన దాడిలో మరణించారని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ మంగళవారం ప్రకటించారు. వివరాల్లోకి వెళితే.. సోమవారం రాత్రి ఇరాన్ రాజధాని టెహ్రాన్‌తో పాటు పలు ప్రాంతాల్లో ఇజ్రాయెల్ సైన్యం భారీ వైమానిక దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో అలీ లారిజానీతో పాటు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ (IRGC)కు చెందిన బాసిజ్ ఫోర్స్ కమాండర్ గులాం రెజా సులేమానీ కూడా హతమైనట్లు మంత్రి కాట్జ్ పేర్కొన్నారు. "శత్రువులను ఏరివేసే క్రమంలో భాగంగా వీరిని అంతం చేయడం జరిగింది" అని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.
ఇరాన్ స్పందన..
అయితే, అలీ లారిజానీ మరణ వార్తపై ఇరాన్ ప్రభుత్వం నుండి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ధృవీకరణ లేదు. ఇరాన్ స్టేట్ మీడియా ఈ వార్తలను వెంటనే ధృవీకరించలేదు. కానీ, లారిజానీ కార్యాలయం నుండి త్వరలోనే ఒక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సమాచారం. అలీ లారిజానీ ఇరాన్ రాజకీయాల్లో అత్యంత ప్రభావవంతమైన నేతలలో ఒకరు. ఆయన 12 ఏళ్ల పాటు ఇరాన్ పార్లమెంట్ స్పీకర్‌గా పనిచేశారు. గతంలో ఇరాన్ అగ్ర నాయకుడు అయతొల్లా అలీ ఖమేనీకి అత్యంత సన్నిహితుడిగా మరియు కీలక సలహాదారుగా గుర్తింపు పొందారు. ఒకవేళ ఈ వార్త నిజమైతే, ఫిబ్రవరి 28న జరిగిన దాడిలో అయతొల్లా అలీ ఖమేనీ మరణించిన తర్వాత ఇరాన్‌కు ఇది అతిపెద్ద ఎదురుదెబ్బగా భావించవచ్చు.






