- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లాడెన్ పాక్‌లో హతమయ్యాడనే నిజం మారదు.. పాక్‌పై ఇజ్రాయెల్ ఫైర్
లాడెన్ పాక్‌లో హతమయ్యాడనే నిజం మారదంటూ పాక్‌పై ఇజ్రాయెల్ యూఎన్ ప్రతినిధి డ్యానీ డానన్ ఫైర్ అయ్యారు. దోహాలో దాడులను పాక్ ఖండించడంపై మండిపడ్డారు.

దిశ, నేషనల్ బ్యూరో: ఆల్‌ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్‌కు పాకిస్తాన్ షెల్టర్ ఇచ్చిందనే నిజాన్ని ఎప్పటికీ మార్చలేరని ఇజ్రాయెల్ అన్నది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సమావేశంలో పాకిస్తాన్‌పై ఇజ్రాయెల్ శాశ్వత యూఎన్ ప్రతినిధి డ్యానీ డానన్ అన్నారు. దోహాలో ఇజ్రాయెల్ చేసిన దాడులను పాక్ ఖండించడంపై డానన్ మండిపడ్డారు. పాకిస్తాన్‌లో లాడెన్‌ను యూఎస్ హతమార్చినప్పుడు ఎవరూ కూడా విదేశంలో ఉన్న ఉగ్రవాదిని ఎలా టార్గెట్ చేస్తారని ప్రశ్నించలేదన్నారు.
పాక్ యూఎన్ ప్రతినిధి ఇఫ్తికర్ అహ్మద్ వైపు నేరుగా చూసిన డానన్.. ‘అప్పుడు అందరూ కూడా అసలు ఉగ్రవాదికి ఎందుకు షెల్టర్ ఇచ్చారు? అనే ప్రశ్నించారు. అదే ప్రశ్నను ఇప్పుడు కూడా అడగాలి. అప్పుడు లాడెన్‌కు రక్షణ దొరకలేదు. ఇప్పుడు హమాస్‌కు కూడా రక్షణ ఉండకూడదు’ అని డానన్ స్పష్టంచేశారు. అమెరికాపై జరిగిన 9/11 ఉగ్రదాడులు జరిగి 24 ఏళ్లు అయిన సందర్భంగా జరిగిన సమావేశంలో డానన్.. సభ్యదేశాల డబుల్ స్టాండర్డ్స్‌ను ప్రశ్నించారు.
‘ఇజ్రాయెల్‌కు అక్టోబర్ 7 లాగానే.. 9/11 అనేది అమెరికాకు ఒక విషాదకర దినం. అప్పుడే ఏ దేశం కూడా ఉగ్రవాదులకు రక్షణ ఇవ్వకూడదని భద్రతా మండలి తీర్మానించింది. ఏ దేశం ఆ పని చేసినా మండలిని కలిపి ఉంచుతున్న నిర్ణయాన్ని ఉల్లంఘించినట్లే. ఈ నియమం అప్పుడు చాలా స్పష్టంగా ఉంది. దాన్నే ఇప్పుడు కూడా నిలబెట్టాలి అంటున్నాం’ అని డానన్ చెప్పారు. పాకిస్తాన్‌లో లాడెన్‌ను హతమార్చారనే నిజం ఎప్పటికీ మారదని, అప్పుడు యూఎస్‌ను ఎవరూ ఖండించలేదని డానన్ గుర్తుచేశారు. అలాగే మండలిలోని ఇతర దేశాలు ఉగ్రవాదులపై దాడి చేసినా ఎవరూ ఖండించరని, కానీ ఇజ్రాయెల్ విషయంలో మాత్రం డబుల్ స్టాండర్స్ అమలు చేస్తారని, అదే యూఎన్ భద్రతా మండలిలోని సమస్య అని విమర్శించారు.






