- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అమెరికాను ఎదురించి మరీ, ఇండియాకు ఇజ్రాయెల్ భారీ సాయం !
అమెరికాను ఎదురించి మరీ, ఇండియాకు ఇజ్రాయెల్ భారీ సాయం చేసింది. 1971 నుంచి ఇప్పటి వరకు సాయం చేస్తూనే ఉంది.

దిశ, వెబ్ డెస్క్: ప్రధాని నరేంద్ర మోడీ ప్రస్తుతం విదేశీ పర్యటనలో బిజీగా ఉన్నారు. వరుసగా విదేశాల్లో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ నిన్న ఇజ్రాయెల్ లో అడుగుపెట్టారు. రెండు రోజుల పాటు ఇజ్రాయెల్ లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటిస్తారు. అయితే, నిన్న ఇజ్రాయెల్ లో అడుగుపెట్టిన ప్రధాని నరేంద్ర మోడీకి అరుదైన గౌరవం దక్కింది. ఇజ్రాయెల్ పార్లమెంట్ ను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు.
ఈ నేపథ్యంలోనే ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్ ప్రధాన మంత్రిగా నరేంద్ర మోడీ రికార్డు సృష్టించాడు. ఇక అంతకుముందు ఇజ్రాయెల్ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోడీకి ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. ఇరు దేశాల మధ్య భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం, రక్షణ, అంతరిక్షం, ఉగ్రవాదం పై పోరు అంశాల నేపథ్యంలో ఇజ్రాయెల్ కు వెళ్లారు ప్రధాని నరేంద్ర మోడీ. అయితే ఈ సందర్భంగా గతంలో ఇండియాకు ఇజ్రాయెల్ చేసిన సహాయం.. వాళ్లు చేసిన ధైర్య సాహసాలు వైరల్ గా మారాయి.
ఇండియాకు ఎప్పుడు అండగానే ఇజ్రాయెల్
మొదటి నుంచి ఇండియాకు అండగానే నిలుస్తోంది ఇజ్రాయెల్. 1971 సంవత్సరంలో అమెరికాను ఎదిరించి మరి ఇండియాకు రహస్యంగా ఆయుధాలు, ట్రైనింగ్ అందించింది ఇజ్రాయెల్ దేశం. అలాగే 1980లో పాక్ అణు కేంద్రాన్ని ధ్వంసం చేసేందుకు కూడా ఇండియాకు ఆఫర్ ఇచ్చింది. మొన్నటి ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో పూర్తిస్థాయిలో ఇండియాకు మద్దతు తెలిపింది ఇజ్రాయెల్. ఐక్యరాజ్యసమితిలో వాషింగ్టన్ కంటే ఢిల్లీనే ఎక్కువగా నమ్ముతానని బెంజిమిన్ నెతన్యాహు ప్రకటన చేశారు. వ్యవసాయం, రక్షణ, అంతరిక్షం వివిధ రంగాల్లో రెండు దేశాల మధ్య సహాయ సహకారాలు కొనసాగుతున్నాయి.






