ఇరాన్ సుప్రీం లీడర్ హత్యకు ఇజ్రాయెల్ ప్లాన్.. నో చెప్పిన ట్రంప్

by Naga Rani Yarlagadda |

ఇరాన్ పై ఇజ్రాయెల్, ఇజ్రాయెల్ (Israel - Iran War)పై ఇరాన్ పరస్పర దాడులు జరుగుతుండటంతో ఇరు దేశాలు ప్రతీకారం తీర్చుకోవాలని ఎదురుచూస్తున్నాయి.

ఇరాన్ సుప్రీం లీడర్ హత్యకు ఇజ్రాయెల్ ప్లాన్.. నో చెప్పిన ట్రంప్
X

దిశ, వెబ్‌డెస్క్: ఇరాన్ పై ఇజ్రాయెల్, ఇజ్రాయెల్ (Israel - Iran War)పై ఇరాన్ పరస్పర దాడులు జరుగుతుండటంతో ఇరు దేశాలు ప్రతీకారం తీర్చుకోవాలని ఎదురుచూస్తున్నాయి. అవకాశం దొరికినప్పుడల్లా పరస్పరం మిస్సైళ్లతో విరుచుకుపడుతున్నాయి. ఈ క్రమంలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ (Ayatullah Ali Khamenei)ని హత్య చేసేందుకు ఇజ్రాయెల్ ప్రణాళిక సిద్ధం చేసినట్లు యూఎస్ అధికారులు వెల్లడించారు. అయితే ఇందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నో చెప్పారని పేర్కొన్నారు. ఇప్పటి వరకూ ఇరానియన్లు అమెరికన్ల జోలికి రాలేదని, వారు అమెరికన్లు ఎవరినీ చంపలేదని, అమెరికన్ల జోలికి రానంతవరకూ ఈ విషయంలో తాము జోక్యం చేసుకోబోమని స్పష్టం చేశారు.

దీనిపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ స్పందించారు. "ఎన్నో తప్పుడు నివేదికలు వస్తుంటాయి. వాటిపై నేను వ్యాఖ్యానించను. మాకు ఏం చేయాలో తెలుసు. మేం చేయాల్సింది చేస్తాం" అని అన్నారు. ఇజ్రాయెల్ ఇరాన్ న్యూక్లియర్ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు భారీ దాడులు చేస్తోంది. ఈ సందర్భంలో ఖమేనీ హత్య ప్రణాళిక తెరపైకి వచ్చినట్లు తెలుస్తోంది. ట్రంప్ మాత్రం దౌత్యపరమైన పరిష్కారాన్ని ప్రోత్సహిస్తూ.. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఒప్పందం కుదరాలని పిలుపునిచ్చారు.

Next Story