- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Israel: ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో కీలక పరిణామం.. ఆ ప్రాంతాల్లో సీజ్ ఫైర్‌కు ఓకే
ఇజ్రాయెల్ హమాస్ మధ్య కొనసాగుతున్న వివాదం ఇటీవల తీవ్ర రూపం దాల్చిన తెలిసిందే.

దిశ, నేషనల్ బ్యూరో: ఇజ్రాయెల్ హమాస్ (Istrael Hamas) మధ్య కొనసాగుతున్న వివాదం ఇటీవల తీవ్ర రూపం దాల్చిన తెలిసిందే. గాజాపై నిరంతరం ఇజ్రాయెల్ దాడులకు పాల్పడుతుండటంతో ఆ ప్రాంతంలో తీవ్ర మానవతా సంక్షోభం నెలకొంది. దీంతో ఈ పరిస్థితిని నివారించడానికి ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) కీలక నిర్ణయం తీసుకుంది. గాజాలోని మూడు ప్రాంతాల్లో తాత్కాలిక కాల్పుల విరమణ అమలు చేస్తున్నట్టు ప్రకటించింది. దీని ప్రకారం.. అల్-మవాసి, దేయిర్ అల్-బలా, గాజా నగర ప్రాంతాల్లో ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సైనిక కార్యకలాపాలు నిలిపివేయబడతాయి.
ఘర్షణతో ప్రభావితమైన పౌరులకు ఆహారం, నీరు, వైద్య సామాగ్రి వంటి అవసరమైన సహాయాన్ని అందించడానికి అనుమతడమే లక్ష్యంగా ఈ డిసిషన్ తీసుకున్నట్టు ఐడీఎఫ్ తెలిపింది. సహాయక వాహనాల రాకపోకలను సులభతరం చేయడం, సురక్షిత మార్గాలను ఏర్పాటు చేయడానికి సైన్యం కట్టుబడి ఉన్నట్టు పేర్కొంది. మరోవైపు ఇజ్రాయెల్ తొలిసారిగా గాజాకు మానవతా సహాయం అందించినట్టు పలు కథనాలు వెల్లడించాయి. గాజాకు పిండి, చక్కెర, మందులు, డబ్బాల్లో ఉన్న ఆహారాన్ని విమానంలో తరలించినట్టు తెలిపాయి.






