- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Israel: ఇరాన్ అణు కేంద్రాలపై దాడికి ఇజ్రాయెల్ ప్లాన్.. యూఎస్ ఇంటలిజెన్స్ సంచలన రిపోర్ట్
ఇరాన్ అణు కేంద్రాలపై దాడి చేసేందుకు ఇజ్రాయెల్ ప్లాన్ చేస్తోందని అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి.

దిశ, నేషనల్ బ్యూరో: ఇరాన్ (Iran) అణు కేంద్రాలపై దాడి చేసేందుకు ఇజ్రాయెల్ (Israel) ప్లాన్ చేస్తోందని అమెరికా ఇంటెలిజెన్స్ (Intelligance) వర్గాలు వెల్లడించాయి. ఈ చర్యకు గాను ఇప్పటికే సిద్ధమైందని తెలిపాయి. ‘ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ పై అటాక్ చేసేందుకు ఇజ్రాయెల్ ప్రణాళికలు వేస్తోంది. రోజురోజుకూ దాడులు చేసే అవకాశాలు గణనీయంగా పెరుగుతున్నాయి. కాబట్టి దాడి జరిగే చాన్స్ ఉంది’ అని ఓ సీనియర్ అధికారి తెలిపారు. అయితే ఇజ్రాయెల్ నాయకులు దీనిపై తుది నిర్ణయం తీసుకున్నారా లేదా అనేది ఇంకా స్పష్టంగా తెలియదని పేర్కొన్నారు. ఇజ్రాయెల్ ఏదైనా చర్య తీసుకోవాలా వద్దా అనే దానిపై అమెరికా ప్రభుత్వంలో తీవ్ర భిన్నాభిప్రాయాలు ఉన్నాయని వెల్లడించారు.
అమెరికా నిఘా వర్గాల నివేదికలతో పశ్చిమాసియాలో తీవ్ర ఆందోళనలు నెలకొన్నాయి. అయితే ఇజ్రాయెల్ దాడిని కొనసాగిస్తుందా లేదా అనేది ఇరాన్ అణు సమస్యపై జరుగుతున్న అమెరికా-ఇరాన్ చర్చలపై ఆధారపడి ఉంటుందని తెలుస్తోంది. కాగా, ఇరాన్‌తో న్యూక్లియర్ డీల్ కోసం యూఎస్ ప్రయత్నిస్తున్న వేళ ఈ సంచలన నివేదిక బయటకు రావడం గమనార్హం. ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడి చేస్తే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భారీ విభేదాలు తలెత్తుతాయని, ఇది ప్రాంతీయ యుద్ధాన్ని ప్రారంభించే ప్రమాదం కూడా ఉందని పలువురు భావిస్తున్నారు.






