వంటింటిపై ఇజ్రాయెల్-ఇరాన్ వార్ ఎఫెక్ట్.. గ్యాస్ ధరలను భారీగా పెంచిన మోడీ సర్కార్

by velandi.Saikiran |   (  Updated:2026-03-07 02:17:31  IST  )

14.2 కిలోల వంట గ్యాస్ సిలిండర్ ధరపై రూ.60,19 కిలోల కమర్షియల్ సిలిండర్ పై ఏకంగా 115 రూపాయలు పెంచింది కేంద్రం.

వంటింటిపై ఇజ్రాయెల్-ఇరాన్ వార్ ఎఫెక్ట్.. గ్యాస్ ధరలను భారీగా పెంచిన మోడీ సర్కార్
X

దిశ‌, వెబ్ డెస్క్‌: యుద్ధం జ‌రుగుతోన్న నేప‌థ్యంలో సామాన్యులకు ఊహించని షాక్ తగిలింది. సిలిండర్ ధరలు భారీగా పెరిగిపోయాయి. వంట గ్యాస్, కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరలను కేంద్ర ప్రభుత్వమే భారీగా పెంచేసింది. ఈ మేరకు అర్ధరాత్రి నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం తాజాగా పెంచిన ధరల ప్రకారం.. 14.2 కిలోల వంట గ్యాస్ సిలిండర్ ధరపై రూ. 60 పెరిగింది. 19 కిలోల కమర్షియల్ సిలిండర్ పై ఏకంగా రూ.115 పెంచింది కేంద్రం. ఈ కొత్త ధరలు నేటి నుంచే అమలులోకి వస్తాయని సంచలన ప్రకటన చేసింది.

ఈ లెక్క ప్రకారం హైదరాబాద్ లో 14.2 కేజీల డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.905 నుంచి 965 రూపాయలకు చేరింది. అటు 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర 1961 రూపాయల నుంచి రూ.2076కు చేరింది. అయితే ఉజ్వల్ పథకం కింద అందించే సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు లేదని సర్కార్ క్లారిటీ ఇచ్చింది. మిడిల్ ఈస్ట్ దేశాలలో యుద్ధ వాతావరణం ఉన్న నేపథ్యంలోనే వంట గ్యాస్ ధరలు పెరిగినట్లు తెలుస్తోంది. వంట గ్యాస్ ను కాస్త అదుపులో వినియోగించుకోవాలని కూడా నిపుణులు సూచిస్తున్నారు.

పెరిగిన ధ‌ర‌లు ఇలా ఉన్నాయి

దేశ రాజధాని ఢిల్లీలో 14.2 కేజీల సిలిండర్ ధర రూ. 853 నుంచి రూ. 913 కు పెరిగింది. అదే సమయంలో కమర్షియల్ 19 కేజీల సిలిండర్ ధర రూ. 1968.50 నుంచి రూ.1883 పెరిగింది. ముంబై మహా నగరంలో రూ.852.50 ఉన్న డొమెస్టిక్ సిలిండర్ ధర రూ. 912.50కి చేరింది. కమర్షియల్ సిలిండర్ ధర రూ. 115 పెరిగి రూ. 1835 కు చేరుకుంది. కోల్ కతా లో రూ. 879 ఉన్న డొమెస్టిక్ సిలిండర్ ధర రూ. 939కి చేరింది. కమర్షియల్ సిలిండర్ ధర రూ. 1990 కి చేరుకుంది. హైదరాబాద్ లో 14.2 కేజీల డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.905 నుంచి రూ.965 కు చేరనుంది. కేజీల కమర్షియల్ సిలిండర్ ధర రూ.2076కు చేరనుంది.

Next Story