2 డాలర్లకే మిసైల్స్ ధ్వంసం.. ఐరన్ బీమ్ వ్యవస్థను తెచ్చిన ఇజ్రాయెల్

by Phanindra |

2 డాలర్లకే మిసైల్స్ ధ్వంసం చెయ్యగలిగే ఐరన్ బీమ్ వ్యవస్థను ఇజ్రాయెల్ అందుబాటులోకి తెచ్చింది. తాజాగా దీన్ని డిప్లాయ్ చేసినట్లు ప్రకటించింది.

2 డాలర్లకే మిసైల్స్ ధ్వంసం.. ఐరన్ బీమ్ వ్యవస్థను తెచ్చిన ఇజ్రాయెల్
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇజ్రాయెల్ అత్యంత అధునాతనమైన లేజర్ రక్షణ వ్యవస్థను డిప్లాయ్ చేసింది. ఆ దేశానికి చెందిన రఫేల్ అడ్వా్న్స్‌డ్ డిఫెన్స్ సిస్టమ్స్ అధికారికంగా ఈ వారంలోనే ఈ హై పవర్ లేజర్ ఇంటర్‌సెప్షన్ వ్యవస్థను విడుదల చేసింది. యుద్ధానికి ఉపయోగపడేలా సిద్ధం చేసిన ఈ వ్యవస్థను ‘ఐరన్ బీమ్’ అని కూడా పిలుస్తారు. శత్రువులు ప్రయోగించే మిసైల్స్, యుద్ధవిమానాలు అన్నింటినీ ఈ లేజర్ క్షణాల్లోనే ధ్వంసం చేస్తుంది.

సాధారణంగా మిసైళ్లను అడ్డుకుని, ధ్వంసం చేసే వ్యవస్థల్లో ఒక్కో మిసైల్‌ను ధ్వంసం చేసినందుకు 60 వేల డాలర్ల వరకు ఖర్చవుతుంది. కానీ ఈ లేజర్ కేవలం ఒక ఎలక్ట్రిక్ షాక్‌కు 2 డాలర్ల ఖర్చుతోనే మిసైళ్లను ధ్వంసం చెయ్యగలదని నిపుణులు చెప్తున్నారు. మిసైల్ కనిపించిన వెంటనే ఈ లేజర్‌తో వాటిని ధ్వంసం చేస్తామని, మధ్యలో ఏమాత్రం సమయం వృధా అవ్వదని ఇజ్రాయెల్ మాజీ ప్రధాని నఫ్తాలీ బెన్నెట్ చెప్పారు.

Next Story