- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గాజా సిటీపై ఇజ్రాయెల్ భీకర దాడులు..భవనాలు నేలమట్టం
గాజా సీటీపై మరోసారి ఇజ్రాయెల్ భీకర దాడులకు పాల్పడింది. భారీ భవనాలనే లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ ఈ దాడులు చేసింది. ఇజ్రాయెల్ దాడుల్లో భారీ భవనం నేలమట్టం అయ్యింది.

దిశ, వెబ్ డెస్క్: గాజా సీటీపై మరోసారి ఇజ్రాయెల్ భీకర దాడులకు పాల్పడింది. భారీ భవనాలనే లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ ఈ దాడులు చేసింది. ఇజ్రాయెల్ దాడుల్లో భారీ భవనం నేలమట్టం అయ్యింది. భవనం కూలిపోతున్న వీడియోలను ఇజ్రాయెల్ రక్షణమ మంత్రి కాట్జ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. భవనంపై దాడి జరగ్గానే ఒక్కసారిగా కూలిపోతున్న దృష్యాలు వీడియోలో కనిపిస్తున్నాయి. అయితే ఈ దాడులకు ముందే సిటీని అందరూ ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ హెచ్చరికలు జారి చేసింది. దక్షిణ గాజాకు వెళ్లిపోవాలని ఆదేశించింది.
అంతే కాకుండా మువాసిలో తాత్కాలిక శిబిరంతో పాటు ఖాన్ యూనిస్‌లోని కొన్ని ప్రాంతాలను మానవతా జోన్‌గా ప్రకటించింది. హమాస్ ఉగ్రవాదుల మౌలిక సదుపాయాలు ఉన్నట్టు పేర్కొంది. ఈ క్రమంలోనే రెండు భవనాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. ఇజ్రాయెల్ చేసిన దాడులపై ఆ దేశపౌరులు కొందరు నిరసన తెలిపారు. తమ దేశానికి చెందిన కొంతమంది గాజాలో బందీలుగా ఉన్నారని వాళ్ల రక్షణ గురించి పట్టించుకోకుండా దాడులు చేస్తున్నారని మండిపడ్డారు.






