100 టార్గెట్లపై ఇజ్రాయెల్ దాడులు.. 33 మంది పాలస్తీనియన్లు మృతి

by Phanindra |

గాజాలోని 100 టార్గెట్లపై ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఈ దాడుల్లో 33 మంది పాలస్తీనియన్లు మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు.

100 టార్గెట్లపై ఇజ్రాయెల్ దాడులు.. 33 మంది పాలస్తీనియన్లు మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: గాజాపై ఇజ్రాయెల్ దాడుల్లో కనీసం 33 మంది పాలస్తీనియన్లు మరణించినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు గాజా అధికారులు చెప్పారు. గాజాలో వందకుపైగా లక్ష్యాలపై తాము దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అమెరికా పర్యటనకు వెళ్తున్న సమయంలో ఈ దాడులు జరగడం గమనార్హం. గాజా పట్టణంలో 20 మంది మరణించగా, మువాసీపై జరిగిన దాడుల్లో 13 మంది మృతిచెందినట్లు గాజా అధికారులు వెల్లడించారు. అయితే గాజాలోకి ఆహారం తదితర వస్తువులు పంపేందుకు శనివారం రాత్రి జరిగిన ఇజ్రాయెల్ సెక్యూరిటీ కేబినెట్ అంగీకరించినట్లు ఇజ్రాయెల్ అధికారులు చెప్తున్నారు.

Next Story