గాజాలో ఆహారం సరఫరాకు అనుమతిచ్చిన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు

by S Gopi |

ఈ సందర్భంగా దిగ్బంధాన్ని ఎత్తివేయడానికి పెరుగుతున్న అంతర్జాతీయ ఒత్తిడిని నెతన్యాహు అంగీకరించారు.

గాజాలో ఆహారం సరఫరాకు అనుమతిచ్చిన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇజ్రాయెల్, హమాస్ ఉద్రిక్తతల మధ్య 11 వారాలుగా గాజాకు ఆహారం సహా అన్ని సహాయ కార్యకలాపాలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఆహారం లభించక పదుల సంఖ్యలో సామాన్యులు ప్రాణాలు కోల్పోతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్ సోమవారం ఆకలితో అలమటిస్తున్న గాజాకు అవసరమైన స్థాయిలో ఆహారం సరఫరా చేసేందుకు అనుమతిస్తున్నట్టు ప్రకటించింది. ప్రాణాలను కాపాడటానికి కాదు, అమెరికా సెనేట్‌లోని మిత్రదేశాల ఒత్తిడి తర్వాత గాజాలోకి పరిమిత ఆహారాన్ని అనుమతించాలనే నిర్ణయం తీసుకున్నామని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు చెప్పారు. 'దౌత్యపరమైన కారణాల వల్ల' గాజాలో కరువును నివారించడం ఇజ్రాయెల్‌కు అవసరమైందని టెలిగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియో మెసేజ్‌లో అన్నారు. ఈ సందర్భంగా దిగ్బంధాన్ని ఎత్తివేయడానికి పెరుగుతున్న అంతర్జాతీయ ఒత్తిడిని నెతన్యాహు అంగీకరించారు. ఆచరణాత్మక, దౌత్యపరమైన కారణాల వల్ల గాజా ప్రజలు కరువులో ఉండిపోకూడదని అన్నారు. ఇదే సమయంలో, ఇజ్రాయెల్‌కు గట్టి సంబంధాలు ఉన్న దేశాధినేతల నుంచి ఒత్తిడి ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ప్రజలు సాముహిక ఆకలితో ఉండటాన్ని తాము చూడలేము. ఈ ఒక్క విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని, దీని కారణంగా మీకు మద్దతివ్వడం కష్టంగా మారుతుందని చెప్పినట్టు బెంజమిన్ నెతన్యాహు తెలిపారు. అది ఏ దేశమనేది నెతన్యాహు పేర్కొనలేదు. అందుకే ఏదొక విధంగా సమస్యను పరిష్కరించాలనుకున్నామన్నారు. గాజాకు అందాల్సిన సహాయం గురించి నేతన్యాహూ ఆఫీసు వర్గాలు.. ఐడీఎఫ్ సిఫార్సు మేరకు, హమాస్‌ను ఓడించేందుకు సైనిక చర్యను పెంచుతూ, గాజా స్ట్రిప్‌లో ఎలాంటి ఆకలి సంక్షోభం తలెత్తకుండా చూసుకునేందుకు కొంతవరకు ఆహారం సరఫరా చేయడానికి అనుమతిచ్చామని వెల్లడించాయి.

Next Story