ఉగ్రదాడి వెనుక ఐఎస్ఐ, హమాస్..సంచలన విషయాలు గుర్తించిన ఇంటిలిజెన్స్

by Ajay Maddhiboyina |

పహల్గామ్ ఉగ్రదాడి వెనుక ISI, హమాస్ ఉన్న‌ట్టు ఇంటిలిజెన్స్ ఏజెన్సీలు గుర్తించాయి. బంగ్లాదేశ్ లో సైతం ఐఎస్ఐ త‌న

ఉగ్రదాడి వెనుక ఐఎస్ఐ, హమాస్..సంచలన విషయాలు గుర్తించిన ఇంటిలిజెన్స్
X

దిశ, వెబ్ డెస్క్: పహల్గామ్ ఉగ్రదాడి వెనుక ISI, హమాస్ ఉన్న‌ట్టు ఇంటిలిజెన్స్ ఏజెన్సీలు గుర్తించాయి. బంగ్లాదేశ్ లో సైతం ఐఎస్ఐ త‌న నెట్‌వర్క్ విస్తరిస్తున్నట్టు తెలిపాయి. కొన్ని రోజుల క్రితమే హమాస్ నేతలు పీఓకేలో భారీ ర్యాలీలు నిర్వహించినట్టు గుర్తించాయి. సభలు సమావేశాలు సైతం నిర్వహించినట్టు పేర్కొన్నాయి. ఇజ్రాయెల్ పై దాడి చేసిన తీరులోనే కాశ్మీర్‌పై కూడా దాడి చేయాలని నిర్ణయించినట్టు తెలిపాయి. ఎల్ఈటీ,జెఈటీ సైతం హమాస్ ట్రైనింగ్ షెడ్యూల్‌ను పాటిస్తున్నట్టు తెలిపాయి.

ఈ రెండు ఉగ్రవాద సంస్థలకు కూడా పాకిస్థాన్ ఐఎస్ఐ మద్దతు ఉన్నట్టు పేర్కొన్నాయి. ఉగ్రవాదులు పీఓకేలోనే ట్రైనింగ్ తీసుకుంటున్నట్టు గుర్తించాయి. దాడి చేసిన వారిలో పాకిస్థాన్ ఉగ్రవాదులతో పాటూ కొందరు స్థానికులు సైతం ఉన్నట్టు ప్రకటించాయి. పీఓకేలో కొద్దిరోజుల క్రితం జరిగిన సమావేశంలో హమాస్‌తో పాటూ ఎల్ఈటీ, జెఈటీ ఉగ్రవాద సంస్థల నేతలు పాల్గొన్నట్టు గుర్తించాయి. ఇక ఇంటిలిజెన్స్ ఇచ్చిన సమాాచారంతో ఆర్మీ రంగంలోకి దిగింది. ఉగ్రమూకలను ఏరిపారేస్తామని ప్రధాని ప్రకటించడంతో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేదానిపై ఆసక్తి నెలకొంది.

Next Story