- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అమ్మో.. చేప కొరికితే ఇంత డేంజరా? చేతినే తొలగించారుగా..!
కుక్కు కరిస్తే ఇంజెక్షన్ వేయించుకోవాలని అందరికి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్: కుక్కు కరిస్తే ఇంజెక్షన్ వేయించుకోవాలని అందరికి తెలిసిందే. మరీ చేప కొరికితే ఏం చేయాలి? దీనికి చాలా మంది ఇదో ప్రశ్నా అంటూ కొట్టిపారేస్తారు. అసలు చేప కొరికితే ఏం అవుతుంది, అదేమైనా ప్రమాదకరమైనా జంతువా అని లైట్ తీసుకుంటారు. కానీ, ఇప్పుడు చెప్పబోయే విషయం వింటే ఇంకెప్పుడూ ఇలా లైట్ తీసుకోరు. ఎందుకంటే.. చేప కాటు కారణంగా ఓ వ్యక్తి ఏకంగా తన చేతినే కొల్పోయాడు? నమ్మడానికి ఆశ్చర్యకరంగా ఉన్న ఇదే నిజం. అసలు ఏం జరిగిందో వివరాల్లోకి వెళ్లితే..
కేరళలోని (Kerala) కన్నూరు జిల్లా థలస్సెరికి చెందిన టి. రాజేశ్ (38) అనే వ్యక్తికి ఫిబ్రవరి 10న తన పొలంలోని చెరువును శుభ్రం చేస్తున్నాడు. ఆ సమయంలో 'కడు' అనే రకం చేప అతడి కుడి చేతివేలిని కొరకడం వల్ల అతడి కుడి చేతి వేలిపై చిన్న గాయమైంది. వెంటనే స్థానికంగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లి వైద్యం చేయించుకున్నాడు. అయితే, ఎన్ని రోజులైనా గాయం మానకపోగా, నొప్పి ఎక్కువై అరచేతిపై బొబ్బలు వచ్చాయి. దీంతో మరోమారు ఆసుపత్రికి వెళ్తే వైద్యులు రకరకాల పరీక్షలు చేసి 'గ్యాస్ గ్యాంగ్రీన్ (Gas Gangrene)' అనే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ సోకినట్టు తేల్చారు.
ఈ ఇన్ఫెక్షన్‌కు చికిత్స అది సోకిన భాగాన్ని తొలగించాలి వైద్యులు చెప్పారు. దీంతో తొలుత చేతి వేళ్లను తొలగించారు. ఆ తర్వాత అరచేతిని పూర్తిగా తొలగించారు. ఇక ఇసుక, బురద నీటిలో కనిపించే క్లోస్ట్రడియం పెర్ఫ్రింజెన్స్ అనే బ్యాక్టీరియ వల్ల ఈ గ్యాస్ గ్యాంగ్రీన్ అనే ఇన్ఫెక్షన్ వస్తుందని ఈ సందర్భంగా వైద్యులు వివరించారు. కాగా, లక్షమందిలో ఒకరిద్దరికి మాత్రమే ఇలాంటి పరిస్థితి వస్తుందని తెలిపారు. కేరళలో ఈ వ్యాధి ఇద్దరికి సోకగా అందులో రాజేశ్ ఒకరు కావడం గమనార్హం.






