- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫ్యాన్లకు ఇనుప కవచం.. విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు హాస్టళ్ల వింత ప్రయత్నం? వైరల్
ఆత్మహత్యలను నివారించడానికి కోటాలోని హాస్టల్ యాజమాన్యాలు తీసుకుంటున్న ఒక సరికొత్త చర్య ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారడమే కాకుండా, తీవ్ర చర్చకు దారితీస్తోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: రాజస్థాన్‌లోని ప్రసిద్ధ కోచింగ్ హబ్ ‘కోటా’ అనగానే ముందుగా గుర్తొచ్చేది కోచింగ్ సెంటర్లు, ఆ తర్వాత విద్యార్థుల ఆత్మహత్యలు. తీవ్రమైన చదువుల ఒత్తిడి, మానసిక సంఘర్షణతో విద్యార్థులు తనువు చాలిస్తున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. అయితే, ఈ ఆత్మహత్యలను నివారించడానికి కోటాలోని హాస్టల్ యాజమాన్యాలు తీసుకుంటున్న ఒక సరికొత్త చర్య ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారడమే కాకుండా, తీవ్ర చర్చకు దారితీస్తోంది.
రూ.2 వేల ఫ్యాన్‌కు రూ.5 వేల రక్షణ
గతంలో ఆత్మహత్యలు నివారించడానికి హాస్టళ్లలో ‘స్ప్రింగ్ ఫ్యాన్లు’ (ఎవరైనా ఉరి వేసుకోగానే స్ప్రింగ్ సాగిపోయి కిందకు వచ్చేలా) ఏర్పాటు చేశారు. కానీ ఆ ప్రయోగం ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. దీంతో ఇప్పుడు ఏకంగా సీలింగ్ ఫ్యాన్ల చుట్టూ పంజరం లాంటి భారీ ఇనుప గ్రిల్స్ (ఫెన్సింగ్) బిగిస్తున్నారు. ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. గదిలో ఉన్న ఫ్యాన్ ధర కేవలం రూ.2,000 కాగా, దాని చుట్టూ విద్యార్థులు ఉరి వేసుకోకుండా అడ్డుకునేందుకు ఏర్పాటు చేస్తున్న ఇనుప గ్రిల్ ఖర్చు ఏకంగా రూ.5,000 కావడం గమనార్హం. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
అసలు సమస్య వదిలేసి..
హాస్టల్ యాజమాన్యాల చర్యను కొందరు సమర్థిస్తున్నప్పటికీ, ఎక్కువ మంది మాత్రం దీనిపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. భౌతికంగా ఫ్యాన్లకు కంచె వేసినంత మాత్రాన విద్యార్థుల మనసుల్లో ఉన్న ఒత్తిడి పోతుందా? అని మానసిక నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ఈ చర్యలు కేవలం ‘లక్షణాలకు’ చికిత్స చేయడమే తప్ప, ‘అసలు వ్యాధికి’ కాదని వారు పెదవి విరుస్తున్నారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు, అసలు సమస్యను పక్కనపెట్టి ఫ్యాన్లకు గ్రిల్స్ వేయడంపై తమదైన శైలిలో సెటైర్లు వేస్తున్నారు. ‘రూ.2 వేల ఫ్యాన్‌కు రూ.5 వేల సెక్యూరిటీనా.. వచ్చే ఏడాది హాస్టల్ ఫీజులు పెంచడానికి ఇదో కొత్త స్కీమ్ లా ఉందే!’ ‘ఫ్యాన్‌కు గ్రిల్ వేశారు సరే.. మరి బిల్డింగ్ పైనుంచి దూకకుండా హాస్టల్ మొత్తానికి స్పాంజ్ అంటిస్తారా యాజమాన్యాలు?’ ఇది ఆత్మహత్యల నివారణ లాగా లేదు.. స్టూడెంట్స్ ఫ్యాన్‌లు ఎత్తుకెళ్లకుండా ఏర్పాటు చేసిన కంచెల ఉందని నెటిజన్‌లు సెటైర్లు వేశారు.






