- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యుద్ధం వేళ ఇరాన్ కీలక ప్రకటన.. చమురు దిగుమతిపై భారత్‍కు బిగ్ రిలీఫ్
హార్మూజ్ జలసంధి ద్వారా చమురు రవాణాపై ఇరాన్ కీలక ప్రకటన చేసింది. అమెరికా, ఇజ్రాయెల్ మినహా మిగతా దేశాలకు అనుమతినిస్తూ భారత్‌కు ఊరటనిచ్చింది.

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రపంచ దేశాలకు చమురు సహా ఇతర ముఖ్యమైన వస్తురవాణా మార్గంగా ఉన్న హార్మూజ్ జలసంధి విషయంలో ఇరాన్ కీలక ప్రకటన చేసింది. ఈ జలసంధిని నియంత్రించే అధికారం మాకు ఉందని స్పష్టం చేసింది. తాజా పరిస్థితుల దృష్ట్యా అన్ని దేశాలకు చమురు సరఫరా నిలిపివేయాలనుకోవడం లేదని కేవలం యూఎస్, ఇజ్రాయెల్, యూరప్ వెళ్లే నౌకలకు మాత్రం ఈ మార్గంలో వెళ్లనివ్వబోమని మిగతా దేశాలకు రవాణాకు అనుమతి ఇస్తామని పేర్కొంది. ఇరాన్ చేసిన తాజా ప్రకటనతో భారత్ సహా పలు దేశాలకు భారీ ఊరటగా మారనుంది.
20 శాతం రవాణా ఇక్కడి నుంచే:
ఇరాన్‍పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా ప్రారంభించిన యుద్ధం కారణంగా హార్మూజ్ జలసంధిని ఇరాన్ ఇటీవల మూసివేసింది. ప్రపంచ చమురు రవాణాలో 20 శాతం ఈ జలసంధి ద్వారానే జరుగుతుంది. ఇటువంటి అత్యంత ప్రాముఖ్యత కలిగిన మార్గాన్ని ఇరాన్ నిలిపివేసింది. తమ ఆదేశాలను ధిక్కరించి జలసంధి దాటేందుకు ప్రయత్నింస్తే అలాంటి నౌకలను పేల్చివేస్తామని ఇరాన్ హెచ్చరించింది. దీంతో వందలాది నౌకలు ఎక్కడిక్కడ సముద్రంలోనే నిలిచిపోయాయి. అయితే యుద్ధం మొదలై ఐదు రోజులు అవుతుండగా ఈ మార్గం మూసివేతతో ఆయా దేశాలు చమురు దిగుమతి విషయంలో ఆందోళనలు వ్యక్తం చేస్తున్నాయి. ఓ వైపు యుద్ధం తీవ్ర తరం అవుతుండగా దేశీయంగా మరో వైపు చమురు నిల్వలు క్రమంగా పడిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ తీసుకున్న తాజా నిర్ణయం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకూ ఊరట కలిగించనుంది.






