- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇరాన్ విమానాలకు పాక్ ఎయిర్‌బేస్‌లో ఆశ్రయం.. దాయాది మోసం బట్టబయలు!
అమెరికా దాడుల నుంచి ఇరాన్ యుద్ధ విమానాలను రక్షించేందుకు పాకిస్తాన్ తన ఎయిర్‌బేస్‌లో ఆశ్రయం కల్పించినట్లుగా వెలువడుతున్న వార్తలు కలకలం సృష్టిస్తున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: అమెరికా (America), ఇరాన్ (Iran) మధ్య ఉద్రిక్తతల వేళ ఓ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. అమెరికా వైమానిక దాడుల నుంచి ఇరాన్ తన సైనిక విమానాలను కాపాడుకునేందుకు పాకిస్తాన్ రహస్యంగా సహాయం చేసిందని నివేదికలు పేర్కొంటున్నాయి. అమెరికా దాడుల భయంతో ఇరాన్ తన కీలక సైనిక విమానాలను, ముఖ్యంగా నిఘా, గూఢచారి విమానమైన RC-130ను పాకిస్తాన్‌లోని రావల్పిండిలో ఉన్న నూర్‌ఖాన్ (Nur Khan) ఎయిర్‌బేస్‌కు తరలించినట్లుగా అమెరికా నిఘా వర్గాలు వెల్లడించాయి. ఓవైపు ఇరాన్-అమెరికా మధ్య శాంతి చర్చల కోసం మధ్యవర్తిగా నటిస్తూనే, మరోవైపు ఇరాన్ యుద్ధ విమానాలకు రక్షణ కల్పించడంపై అమెరికా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
అమెరికా సెనేటర్ల హెచ్చరిక..
పాక్ తీరుపై అమెరికా సెనేటర్ లిండ్సే గ్రాహం (Lindsey Graham) స్పందిస్తూ.. ఆ వార్తలు నిజమైతే, పాకిస్తాన్‌ను ఇకపై నమ్మదగిన మధ్యవర్తిగా పరిగణించలేమని అన్నారు. వారి పాత్రపై తాము పునరాలోచన చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. అయితే, ఈ ఆరోపణలను పాకిస్తాన్ ప్రభుత్వం తీవ్రంగా తోసిపుచ్చింది. నూర్‌ఖాన్ ఎయిర్‌బేస్ అత్యంత రద్దీగా ఉండే నగర ప్రాంతంలో ఉందని, అక్కడ భారీ యుద్ధ విమానాలను దాచడం సాధ్యం కాదని అధికారులు వాదిస్తున్నారు. ఆ విమానాలు కేవలం దౌత్యపరమైన చర్చల కోసమే వచ్చాయని పేర్కొన్నారు. మరోవైపు ఇరాన్ పంపిన శాంతి ప్రతిపాదనలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించారు. ఇరాన్ పంపిన ఆ కాగితాలు అర్థం లేనివని, ప్రస్తుతం కాల్పుల విరమణ (Ceasefire) ప్రాణాపాయ స్థితిలో ఉందని కామెంట్ చేసిన విషయం తెలిసిందే.






