ట్రంప్ పై ఏ క్షణమైన డ్రోన్ దాడి జరగొచ్చు.. ఇరాన్ హెచ్చరిక!?

by Jakkula.Mamatha |   (  Updated:2025-07-10 05:47:43  IST  )

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు మరోసారి ఇరాన్ నుంచి బెదిరింపులు ఎదురయ్యాయి.

ట్రంప్ పై ఏ క్షణమైన డ్రోన్ దాడి జరగొచ్చు.. ఇరాన్ హెచ్చరిక!?
X

దిశ,వెబ్‌డెస్క్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు మరోసారి ఇరాన్ నుంచి బెదిరింపులు ఎదురయ్యాయి. ఇటీవల ఇరాన్ అణు కేంద్రాల పై అమెరికా దాడులు చేసిన నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సమయంలో బెదిరింపులు రావడం ఆందోళనను రేకెత్తిస్తుంది. ఈ క్రమంలో ట్రంప్ పై ఏ క్షణంలోనైనా దాడి జరగొచ్చని ఇరాన్ సీనియర్ అధికారి జావద్ లారిజానీ హెచ్చరించారు. సన్‌బాత్ చేసే సమయంలో డ్రోన్‌తో అటాక్ చేయోచ్చని బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో ఫ్లోరిడాలోని నివాసం కూడా ట్రంప్ కు సురక్షితం కాకపోవచ్చని చెప్పారు.

ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ సలహాదారు జావద్ లారిజాని స్థానిక మీడియాతో మాట్లాడుతూ.. 2020లో ఇరాన్ ఉన్నతాధికారి ఖాసీం సులేమాని హత్యలో ట్రంప్ పాత్రను ఉద్దేశించి ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ చీఫ్ ఖమేనీని లక్ష్యంగా చేసుకున్న ప్రతీకారం తప్పదన్నారు. ‘ట్రంప్‌నకు ఫ్లోరిడాలోని మార్-ఎ-లాగో రిసార్ట్ ఏమాత్రం సురక్షితం కాదు. ఆయన సన్‌బాత్ చేస్తుండగా డ్రోన్‌తో లక్ష్యంగా చేసుకోవడం మాకు చాలా సులభమైన పని’ అని ఆయన హెచ్చరించారు. 2020లో ఇరాన్ టాప్ జనరల్ ఖాసిం సులేమానీ హత్య వెనుక ట్రంప్ హస్తం ఉందని ఇరాన్ ఆరోపిస్తోన్న విషయం తెలిసిందే. దీనికి ప్రతీకారంగానే ఈ హెచ్చరికలు చేసినట్లు సమాచారం.

Next Story