ట్రంప్‌ను ఇరాన్ చంపాలని చూస్తోంది: నెతన్యాహు షాకింగ్ కామెంట్స్

by Yella Dhawani Reddy |

ఇరాన్‌లోని అణు కేంద్రాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ ఇటీవల భీకర వైమానిక దాడులకు దిగిన విషయం తెలిసిందే.

ట్రంప్‌ను ఇరాన్ చంపాలని చూస్తోంది: నెతన్యాహు షాకింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్ డెస్క్: ఇరాన్‌లోని (Iran) అణు కేంద్రాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ (Isreal) ఇటీవల భీకర వైమానిక దాడులకు దిగిన విషయం తెలిసిందే. ఈ దాడులు అంతర్జాతీయంగా తీవ్ర చర్చకు దారి తీసిన వేళ, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు చేసిన తాజా వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నే (US President Donald Trump) తమ అణు కార్యక్రమానికి అడ్డుగా భావించిన ఇరాన్‌ ఆయనను చంపాలనే కుట్రకు పాల్పడిందని నెతన్యాహు ఓ న్యూస్ ఛానల్‌కు న్యూస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.

'ఇరాన్‌కు ట్రంప్‌ నంబర్ వన్ శత్రువు. ట్రంప్‌ నిర్ణయాత్మక నాయకుడు. ఇరాన్‌తో జరిగిన నకిలీ అణు ఒప్పందాన్ని ఆయన రద్దుచేశారు. అలాగే, ఇరాన్ వద్ద అణ్వాయుధాలు ఉండకూడదని తేల్చి చెప్పారు. అలాంటి నేతను వారు తప్పించాలనుకోవడంలో ఆశ్చర్యం లేదు' అని నెతన్యాహు షాకింగ్ కామెంట్స్ చేశారు. తనను కూడా ఇరాన్ లక్ష్యంగా పెట్టిందని, ఒకసారి తన ఇంటి బెడ్‌రూమ్ విండోపై మిస్సైల్ దూసుకొచ్చిందని చెప్పారు.

ఇరాన్ అణు బాంబుల తయారీకి, బాలిస్టిక్ మిస్సైళ్ల ఉత్పత్తికి వేగంగా దూసుకెళ్తోందని, ఇది ఇజ్రాయెల్‌కు ద్వంద్వ ముప్పు అని పేర్కొన్నారు. 'మూడు సంవత్సరాల్లో 10,000 క్షిపణులు తయారవుతాయి. మాకు ప్రత్యామ్నాయం లేదు. అందుకే మేము స్పందించాం' అని చెప్పారు. ఈ దాడులతో ఇరాన్ అణు ప్రోగ్రాం పలు దశల వెనక్కి వెళ్లిందని, ఇదంతా ప్రపంచ భద్రత కోసమేనని నెతన్యాహు స్పష్టం చేశారు.

Next Story