- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇరాన్ పాప్ సింగర్‌కు మరణశిక్ష
అతడికి ఈ శిక్ష సరిపోదని ప్రాసిక్యూషన్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో కేసును తిరిగి ఓపెన్ చేశారు.

- మహ్మద్ ప్రవక్తను అవమానించాడనే అభియోగం
- గతంలో దేశద్రోహం కేసులో 5 ఏళ్ల శిక్ష
- శిక్షను అప్పీల్ చేసుకునే అవకాశం ఇచ్చిన కోర్టు
దిశ, నేషనల్ బ్యూరో:
తన గాత్రంతో ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న అమీర్ హుస్సేన్‌కు ఇరాన్ కోర్టు మరణ శిక్ష విధించింది. మహ్మద్ ప్రవక్తను దూషించాడనే అభియోగాలతో పాటు, దేశద్రోహానికి కూడా పాల్పడ్డాడనే ఆరోపణలపై అతడికి ఈ శిక్షను విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. కాగా, ఇదే కేసులో గతంలో అమీర్ హుస్సేన్ 5 ఏళ్ల జైలు శిక్ష అనుభవించాడు. అయితే అతడికి ఈ శిక్ష సరిపోదని ప్రాసిక్యూషన్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో కేసును తిరిగి ఓపెన్ చేశారు. అమీర్ హుస్సేన్ దేశ ద్రోహానికి పాల్పడ్డాడని, దానికి సంబంధించిన ఆధారాలను కోర్టుకు అందించడంతో మరణ శిక్ష ఖరారు చేసినట్లు ఇరాన్ మీడియా పేర్కొంది. టాట్ల్యూగా అభిమానులు పిలుచుకునే అమీర్ హుస్సేన్ 2018 నుంచి టర్కీలోని ఇస్తాంబుల్‌లో నివసించేవాడు. అయితే 2023 డిసెంబర్‌లో టర్కిష్ పోలీసులు అతడిని ఇరాన్‌ను అప్పగించారు. అప్పటి నుంచి ఇరాన్ నిర్బంధంలోనే ఉంటున్న టాట్లూకు తాజాగా మరణ శిక్ష ఖరారు చేశారు. అమీర్ హుస్సేన్‌కు ఇప్పటికే వ్యభిచారానికి మద్దతుగా ప్రచారం చేస్తున్నాడని, అసభ్యకరమైన కంటెంట్‌ను పబ్లిష్ చేస్తున్నాడనే ఆరోపణలపై 10 ఏళ్ల జైలు శిక్ష కూడా ఖరారయ్యింది. కాగా, అమీర్ హుస్సేన్‌కు విధించిన మరణ శిక్షపై అప్పీల్ చేసుకునేందుకు అతనికి కోర్టు అవకాశం ఇచ్చింది.






