యూరప్ దేశాల సైన్యాలను ‘ఉగ్రవాద సంస్థలు’గా గుర్తించిన ఇరాన్!

by Phanindra |

యూరప్ దేశాల సైన్యాలను ‘ఉగ్రవాద సంస్థలు’గా గుర్తించిన ఇరాన్. తమ సైన్యాన్ని ఉగ్రవాద సంస్థగా గుర్తించినందుకేనని ప్రకటన.

యూరప్ దేశాల సైన్యాలను ‘ఉగ్రవాద సంస్థలు’గా గుర్తించిన ఇరాన్!
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇరాన్ సైన్యం ‘ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్’ను ఉగ్రవాద గ్రూప్‌గా యూరప్ దేశాలు గుర్తించాయి. దీంతో ఈ తీర్మానం చేసిన యూరప్ దేశాల సైన్యాలను తాము కూడా ‘ఉగ్రవాద సంస్థలు’గా గుర్తించినట్లు ఇరాన్ ప్రకటించింది. ‘ఐఆర్‌జీసీకి వ్యతిరేకంగా తీర్మానం చేసిన యూరోపియన్ యూనియన్ దేశాల ఆర్మీలను ఉగ్రవాద సంస్థలుగా పరిగణిస్తున్నాం. ఈ మేరకు ఇస్లామిక్ కన్సల్టేటివ్ అసెంబ్లీ తీర్మానం చేసింది. యూరప్ దేశాలు తమ చర్యలకు ప్రతిఫలాన్ని చెల్లించక తప్పదు’ అని ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రెటరీ అలీ లారిజాని ఎక్స్ వేదికగా ప్రకటించారు.

Next Story